ఘోరం.. 142 మంది బాలికపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి..

By Asianet News  |  First Published Nov 24, 2023, 4:17 PM IST

విద్యార్థులకు మంచి నడవడిక, క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ ప్రిన్సిపాల్ బుద్ధి గడ్డి తిన్నది. చదువుకునేందుకు స్కూల్ కు వచ్చే బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరేళ్ల కాలంలో 142 మంది విద్యార్థినులపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.


హర్యానాలో ఘోరం జరిగింది. జింద్ జిల్లాలో ఓ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ 142 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడు ఆరేళ్ల కాలంలో ఇంత మంది విద్యార్థినులపై ఈ దారుణానికి ఒడిగట్టాడు.

విషాదం.. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి.. మరొకరికి గాయాలు.. 

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. ప్రిన్సిపాల్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన 15 మంది బాధిత బాలికలు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సహా పలువురు అధికారులకు లేఖలు రాశారు. ఈ లేఖను హర్యానా మహిళా కమిషన్ పరిశీలించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సెప్టెంబర్ 13న జింద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

cricket world cup 2023 : వరల్డ్ కప్ ఫైనల్.. అలా చేసి ఉంటే భారత్ కచ్చితంగా గెలిచేది - మమతా బెనర్జీ

దీంతో పోలీసులు నిందితుడైన ప్రిన్సిపాల్ ను నవంబర్ 4వ తేదీన అరెస్టు చేశారు. అనంతరం నవంబర్ 7న కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. కాగా.. ఈ ఘటనపై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) నేతృత్వంలోని దర్యాప్తు కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీ దర్యాప్తు సమయంలో తొలుత 60 మంది బాధిత బాలికలు ముందుకు వచ్చారు. తరువాత ఈ సంఖ్య సంఖ్య 142కు చేరిందని రాష్ట్ర మహిళా కమిషన్ పేర్కొంది. 
 Fishing Harbour Fire : నేను ఏ తప్పూ చేయలేదు.. సాయం అందుతుందనే వీడియో పెట్టాను - లోకల్ బాయ్ నాని
ఈ కమిటీ మొత్తంగా 390 మంది బాలికల వాంగ్మూలాలను నమోదు చేసింది. అయితే ఇందులో 142 మంది బాలికలు.. ప్రిన్సిపాల్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. మిగిలిన వారంతా ప్రిన్సిపాల్ ఆకృత్యాలు తాము చూశామని వెల్లడించారు. దీంతో పోలీసులు, విద్యాశాఖ ప్రతినిధులతో కూడిన జిల్లా అధికారుల బృందం ప్రాథమిక విచారణ జరిపి ప్రిన్సిపాల్ ను దోషిగా తేల్చింది. ప్రస్తుతం ఆ ప్రిన్సిపాల్ జైలులో ఉన్నారని అని జింద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఇమ్రాన్ రజా తెలిపారు.

click me!