badminton coach: ఛీ ఛీ.. వీడ‌స‌లు గురువేనా? నగ్న ఫోటోలు పంపమని బాలికలను కోరినవైనం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్ట్

By Mahesh RajamoniFirst Published Nov 24, 2023, 10:53 AM IST
Highlights

Coimbatore: బ్యాడ్మింటన్ కోచ్ పదకొండో తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను తన వాట్సప్ నంబర్ కు ఫోటోలు పంపాలని కోరాడు. ఆ అమ్మాయి తన సాధారణ ఫోటోను పంపిన త‌ర్వాత నగ్న ఫొటోలను పంపాలని కోచ్ బాలికను కోరాడు. 
 

badminton coach: గురువు అనే పేరుకు కళంకం తీసుకువ‌చ్చిన మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన విద్యార్థికి విద్యాలు నేర్పించాల్సిన ఒక గురువు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ బాలిక న‌గ్న ఫొటోల‌ను పంపాలంటూ కోరాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. విష‌యం వెలుగులోకి రావ‌డంతో పోలీసులు నిందితుడైన బ్యాండ్మింట‌న్ కోచ్ ను ఆరెస్టు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. కోయంబత్తూర్‌లోని ఒక ప్ర‌యివేటు పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన బ్యాడ్మింటన్ కోచ్‌ వాట్సాప్‌లో తమ నగ్న చిత్రాలను పంపమని బాలికను కోరిన ఆరోపణలపై పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నగరంలోని సౌరిపాలేనికి చెందిన నిందితుడు అరుణ్ బ్రూన్ (28) మరికొంత మంది విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడనీ, వారి న‌గ్న‌ ఫోటోలు తనకు పంపమని అడిగాడని పోలీసులు తెలిపారు.

Latest Videos

రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన బ్రన్, హోప్ కాలేజ్ సమీపంలోని కామరాజర్ రోడ్‌లోని బ్యాడ్మింటన్ అకాడమీతో అనుబంధం కలిగి ఉన్నాడు. గత ఆరు నెలలుగా నగరంలోని ఒక ప్ర‌యివేటు  పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే బాలిక‌ల ప‌ట్ల అస‌భ్యంగా న‌డుచుకుంటున్నాడ‌నే విష‌యం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలకు చెందిన 17 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం బ్రన్‌పై ఫిర్యాదు చేయ‌డం కోసం కోయంబత్తూరు సెంట్రల్‌లోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్ (AWPS)ని ఆశ్రయించింది.

బ్యాడ్మింటన్ కోచ్ పదకొండో తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికను తన వాట్సప్ నంబర్ కు ఫోటోలు పంపాలని కోరాడు. ఆ అమ్మాయి తన సాధారణ ఫోటోను పంపిన త‌ర్వాత నగ్న ఫొటోలను పంపాలని కోచ్ బాలికను కోరాడు. అయితే, బాలిక పంప‌లేదు. వాట్సాప్‌లో తన నగ్న ఫోటోలను పంపమని బాలిక‌ను కోర‌డంతో పాటు కోచ్ పాఠశాల ఆవరణలో ఆమె ఫోటోలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు బ్రూన్‌పై కేసు నమోదు చేశారు. ఏడబ్ల్యూపీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. వడివుకరసి, ఆమె బృందం అతడిని గురువారం అరెస్టు చేసింది.

click me!