
ఉదయ్ పూర్ టైలర్ హత్యపై హిందూ సమాజం రాజ్యాంగ బద్ధంగా, శాంతియుతంగా స్పందించిందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ఇన్‌చార్జి సునీల్ అంబేకర్ అన్నారు. అయితే ఇదే ఘటనను ముస్లిం సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తారని తాను ఇప్పుడు ఆశిస్తున్నానని తెలిపారు. రాజస్థాన్‌లోని జుంజునులో ఆర్‌ఎస్‌ఎస్ ‘ప్రాంత్ ప్రచారక్’ల (ప్రాంతాల ఇన్‌ఛార్జ్) మూడు రోజుల సమావేశం ముగింపు సందర్భంగా అంబేకర్ మీడియాతో మాట్లాడుతూ.. “ కొందరు ముస్లిం మేధావులు ఆ పని చేశారు (దర్జీ కన్హయ్య లాల్ హత్యను ఖండించారు). అయితే సాధారణంగా ముస్లిం సమాజం ముందుకు వచ్చి ఇలాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇలాంటి ఘటనలు సమాజానికి గానీ, దేశానికి గానీ ప్రయోజనం కలిగించవు.’’ అని అన్నారని ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.
Monkeypox Virus: కోల్‌కతాలో మంకీపాక్స్ కలకలం.. ఫలితాలు వెలువడటంతో..
కోవిడ్-19 ప్రారంభమైన తర్వాత జరిగిన మొదటి భౌతిక సమావేశం ఇది. ఉదయ్‌పూర్, అమరావతిలో జరిగిన హత్యల నేపథ్యంలో పెరుగుతున్న ఇస్లామిక్ రాడికలైజేషన్ అంశంపై ఈ సమావేశంలో సంఘ్ చర్చించింది. సర్సంఘచాలక్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేతో పాటు సంస్థ అగ్ర నాయకులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా కన్హయ్య లాల్ హత్యపై అంబేకర్ మాట్లాడుతూ.. “ ఉదయ్‌పూర్‌లో జరిగిన దారుణ హత్య ఖండించదగినది. ఈ ఘటనపై ఎన్ని విమర్శలు చేసినా సరిపోదు. మనది ప్రజాస్వామ్యం. ఎవరైనా చెప్పేది నచ్చకపోతే, దానికి స్పందించడం ప్రజాస్వామ్య పద్ధతి. ఇలాంటి సంఘటనను నాగరిక సమాజం ఎప్పుడూ విమర్శిస్తుంది.’’ అని అన్నారు. కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన వాల్ పోస్టర్ పై నెలకొన్న వివాదంపై ప్రశ్నించినప్పుడు అంబేకర్ సమాధానమిస్తూ.. ‘‘ భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించేటప్పుడు, ప్రజల మనోభావాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ’’ అని అన్నారు.
Gujarat Bus Accident: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణీకులు!
ఈ సమావేశంపై ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆర్‌ఎస్‌ఎస్ తన పూర్తి శక్తిలో సాధారణ పనులను పునఃప్రారంభించడంపై దృష్టి సారించిందని అన్నారు. ప్రస్తుతం సంఘ్‌కు 56,824 శాఖలు ఉన్నాయని తెలిపారు. ఇందులో నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై ఆర్‌ఎస్‌ఎస్ కృషి ప్రజల భాగస్వామ్యంతో బాగా పురోగమిస్తోందని చెప్పారు. ‘కుటుంబ ప్రబోధన్’ (కుటుంబ విలువల పరిరక్షణ) కార్యక్రమం కొత్త ఊపుతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. గత రెండేళ్లలో దాదాపు 23,000 మంది ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా కార్యక్రమంలో ‘సంఘ్ శిక్షా వర్గ్’లో పాల్గొన్నారని చెప్పారు. ఇందులో 18,981 మంది 40 ఏళ్ల లోపు వారే ఉన్నారని అన్నారు. RSSకి దేశవ్యాప్తంగా 101 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్య్ర పోరాటంలో అజ్ఞాత, అజ్ఞాతవీరులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకతపై ఈ సమావేశంలో చర్చించారు. 2025 సంవత్సరం నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సంస్థ తన శాఖల సంఖ్యను లక్షకు పెంచాలని యోచిస్తోందని అంబేకర్ తెలిపారు.