Monkeypox Virus: ఇటీవల యూరప్ నుంచి భారత్ కు తిరిగి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ లక్షణాలు కనిపించడంతో నగరంలో కలకలం రేగింది. సదరు యువకుడి రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపించారు. సంస్థ నివేదికలో సదరు వ్యక్తి నమూనాల్లో ఎలాంటి వైరస్ నమూనాలు లేవనీ, అతనికి నెగిటివ్ వచ్చినట్టు తెలిపింది.
Monkeypox Virus: ప్రపంచదేశాల్లో మంకీ పాక్స్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. కోల్ కత్తాలో జరిగిన ఓ ఘటన వల్ల భారత్ లో కూడా ఈ మహమ్మారి ప్రవేశించిందా ? మనదేశంలో కూడా ఈ వైరస్ పంజా విసరబోతుందా? అనే ఆందోళనల వ్యక్తమైంది. యూరప్ నుండి కోల్‌కతాకు వచ్చిన ఓ యువకుడిలో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో.. భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మనదేశంలో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రాబోతున్నాయా అనే అనుమానాలు తీవ్రమయ్యాయి.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు.. అనుమానిత వ్యక్తి నమూనాను సేకరించి.. పరీక్ష కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. ఆ నమూనాలను పరీక్షించిన వైద్యులు సదరు వ్యక్తికి మంకీపాక్స్ లేదని, అతని నమూనాలు పరిశీలించగా.. నెగిటివ్ వచ్చినట్టు తేలింది. ఈ వార్త వెలువడటంతో కోల్‌కతాతో సహా దేశ మొత్తం ఊపిరి పీల్చుకుంది.
శుక్రవారం.. కోలకత్తా నగరంలోని ఓ ఆసుపత్రిలో యూరప్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన యువకుడికి దద్దుర్లు, మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. వివిధ పాశ్చాత్య దేశాలలో మంకీపాక్స్ విజృంభిస్తున్న తరుణంలో ఈ కేసు రావడం కలకలం సృష్టించబడింది. అనుమానిత యువకుడి నుంచి సేకరించి శుక్రవారం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపారు.మంకీ పాక్స్ నెగిటివ్ రావడంతో చికెన్ గున్యాకు చికిత్స చేయనున్నట్లు తెలిపారు. త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల అధికారులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేట్ చేయాలని ఎయిర్‌పోర్ట్ అధికారులను ఆదేశించారు.
undefined
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల్లో స్థానిక, స్థానికేతర 6,000 మందికి పైగా మంకీపాక్స్ బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ పరిశోధనలు అంటే కేసులు కనుగొనబడలేదని, సమాజ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ ఈ కేసులను నిశితంగా పరిశీలిస్తోందని, వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు 58 దేశాలలో 6,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. పరీక్ష అనేది ఒక సవాలుగా మారిందనీ, పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం లేదు. యుఎస్ మరియు యుకెలోని వైద్య నిపుణులు ఇంతకుముందు స్లో టెస్టింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం చేశారు.పశ్చిమ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన మంకీఫాక్స్ వైరస్ క్రమంగా.. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించింది. యూరప్ వ్యాప్తికి ప్రస్తుత కేంద్రంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా 80 శాతానికి పైగా కేసులు ఇక్కడే నమోదయ్యాయి.
మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తారా?
ఆఫ్రికాలో ప్రభావితం కాని దేశాలలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన ప్రదేశాలలో రికార్డు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఘెబ్రేయేసస్ చెప్పారు. ఇంతలో WHO చీఫ్.. వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడాన్ని పరిశీలించడానికి ఈ నెలాఖరులో 'ఎమర్జెన్సీ కమిటీని పునర్నిర్మించాలని' యోచిస్తున్నట్లు చెప్పారు. UN ఆరోగ్య ఏజెన్సీ ద్వారా అత్యధిక స్థాయి హెచ్చరికలు ప్రస్తుతం COVID-19 మహమ్మారి, పోలియోకు మాత్రమే వర్తిస్తాయి.