హిజాబ్ వివాదం.. పాఠశాలల్లో మత మార్పిడికి పాల్పడితే ఊరుకోబోము - మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ లోని పాఠశాలల్లో మత మార్పిడులకు పాల్పడితే సహించేంది లేదంటూ ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోని విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తామని తెలిపారు. 


హిజాబ్ వివాదంపై మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్లో ఉన్న గంగా జమునా స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. తమ రాష్ట్రంలో పాఠశాలల్లో మతమార్పిడులకు జరగినవ్వబోమని అన్నారు. భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేని డ్రెస్ కోడ్ ను పాఠశాలల్లో అనుమతించబోమని చెప్పారు. గంగా జమునాలో వెలుగులోకి వచ్చిన హిజాబ్ వివాదంపై విచారణకు ఆదేశించామని అన్నారు.

ప్రత్యేక బడ్జెట్ ను నిలిపేసి రైల్వేలను బీజేపీ నాశనం చేసింది - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Latest Videos

ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తన భద్రతా సిబ్బంది కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు మొరెనా వచ్చిన సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. అంతకు ముందు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా భోపాల్ లో విలేకరులతో మాట్లాడుతూ.. దామోహ్ పాఠశాలపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 295 (ఎ) (మతపరమైన భావాలను రెచ్చగొట్టడం), 506 (బి) (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణలో వెల్లడైన అంశాలను బట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో మత మార్పిడుల కోణాన్ని కూడా పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.

ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ : వెలుగులోకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద క్షణాల వీడియో.. సోషల్ మీడియాలో వైరల్

రాష్ట్ర రాజధాని భోపాల్ కు 250 కిలోమీటర్ల దూరంలోని దామోహ్ లోని గంగా జమునా హయ్యర్ సెకండరీ స్కూల్ పోస్టర్లలో హిందూ విద్యార్థులతో సహా బాలికలు యూనిఫాంలో భాగంగా హిజాబ్ లు ధరించినట్లు కనిపించడంతో రాష్ట్ర విద్యాశాఖ గత వారం గుర్తింపును నిలిపివేసింది. హిందువులను హిజాబ్ ధరించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేసిందని ఆరోపిస్తూ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక్ కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు

ముస్లిం దుకాణదారులు పట్టణం విడిచి వెళ్లాలి : ఉత్తర కాశీలో వెలసిన వివాదాస్పద పోస్టర్లు

పాఠశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ దామోహ్ జిల్లా విద్యాధికారిపై సిరా విసిరిన ముగ్గురు బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. గంగా జమున హయ్యర్ సెకండరీ స్కూల్ ముస్లిమేతర బాలికలను హిజాబ్ ధరించాలని బలవంతం చేస్తోందని ఆరోపిస్తూ వీహెచ్ పీ, భజరంగ్ దళ్, ఏబీవీపీ సహా మితవాద సంఘాలు దామోహ్ లో ఆందోళనకు దిగడంతో ఈ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతోంది.

click me!