
కర్ణాటక రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు రాజధాని బెంగళూరుతో పాలు వివిధ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. వర్షాల వల్ల ఏర్పడిన సమస్యలతో శుక్రవారం నాటికి తొమ్మిది మంది చనిపోయారు.
భారీ వర్షాలు దవణగెరె ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి, రాష్ట్రంలోని హుబ్బళ్లి ప్రాంతంలో కూడా ఉదయం తేలికపాటి జల్లులు పడ్డాయి. అయితే రాష్ట్రంలో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల రోడ్ల వెంట నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. చెట్లు పడిపోతుండటంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి. వాటిని తొలగించడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల సంభవించిన నష్టాలను పరిశీలించడానికి రోజువారీగా నగర పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరుసగా మూడో రోజు నగరంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
భారీ వర్షాల దృష్ట్యా కొన్ని ప్రాంతాలు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించాయి. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైమరీ, హైస్కూళ్లకు డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర గురువారం సెలవు ప్రకటించారు. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్నందున సెలవు ప్రకటించడంపై నిర్ణయం తీసుకోవాలని ఉడిపి డిప్యూటీ కమిషనర్ ఎం.కూర్మారావు పాఠశాలలను కోరారు.
India's first 5G call: స్వదేశీ పరిజ్ఞానంతో 5జీ టెస్ట్ కాల్ విజయవంతం.. కేంద్రం ఏం చెప్పిందంటే..?
మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక రహదారులు కూడా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని పలు ఆనకట్టల్లో నీటి మట్టం పెరిగింది. కృష్ణరాజసాగర్, కబిని, హరంగి, హేమావతి, ఆల్మట్టి, నారాయణపుర, భద్ర, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ వంటి ఆనకట్టలు నిండుకుండలా మారాయి.
కాగా, అస్సాంలో కూడా వరదలు విళయ తాండవం సృష్టిస్తున్నాయి. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో పలు చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో వర్షాల వల్ల ఏర్పడిన సమస్యలతో 9 మంది వరకు చనిపోయారు. వదరల వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్రానికి కేంద్రం అండగా నిలిచింది. విపత్తు నిర్వహణ నిధి కింద నిధులను అందజేసింది. ఆ రాష్ట్ర సీఎంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. వరద పరిస్థితి, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.
చెన్నైలో ఘోరం.. పట్టపగలు, రోడ్డుపై ఫైన్సాన్స్ కంపెనీ నిర్వాకుడిని నరికి చంపిన దుండగులు..
అయితే ఇదే సమయంలో త్రిపుర, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని దాదాపు 27 జిల్లాల్లోని దాదాపు 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడుతున్నారు. వేలాది మందిని సహాయ శిబిరాలకు తరలించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. స్వచ్ఛంద సంస్థలు, శిక్షణ పొందిన వాలంటీర్లు వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.