Azam Khan : ఎస్పీ నేత ఆజం ఖాన్ కు మ‌ధ్యంతర బెయిల్.. రెండేళ్ల తరువాత జైలు నుంచి విడుద‌ల‌..

By team teluguFirst Published May 20, 2022, 11:23 AM IST
Highlights

రెండేళ్ల పాటు జైలులో ఉన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ నేడు విడుదల అయ్యారు. ఆయనను రిసీవ్ చేసుకునేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు శివపాల్ యాదవ్, బిలారీ ఎమ్మెల్యే మహ్మద్. అబ్దుల్లా ఖాన్, అదీబ్ ఖాన్ లు సీతాపూర్ జైలుకు చేరుకున్నారు. 

చీటింగ్ కేసులో జైలుకెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ శుక్రవారం సీతాపూర్ నుంచి జైలు నుంచి విడుద‌ల అయ్యారు. 27 నెలలుగా జైలులో ఉన్న ఆజం ఖాన్‌కు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన వెంట‌నే రాంపూర్‌లోని ప్రత్యేక కోర్టు ఆజం ఖాన్ విడుదల కోసం సీతాపూర్ జైలు అడ్మినిస్ట్రేష‌న్ కు లేఖ (పర్వాన్) పంపించారు. మ‌రోవైపు ఆజం ఖాన్ విడుదల సందర్భంగా సీతాపూర్ జైలు వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. 

| Samajwadi Party leader Azam Khan released from Sitapur district jail, in a matter concerning Kotwali PS in Rampur pic.twitter.com/2TDWwFHi4W

— ANI UP/Uttarakhand (@ANINewsUP)

అయితే ఆజం ఖాన్ విడుద‌ల సంద‌ర్భంగా ఆయన కుమారులు అబ్దుల్లా ఖాన్, అదీబ్ ఖాన్ లు జైలు స‌మీపానికి చేరుకున్నారు. తండ్రి విడుద‌ల నేప‌థ్యంలో వారిద్ద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు. ‘‘ సుప్రీంకోర్టు న్యాయం చేసింది’’ అని వారు పేర్కొన్నారు. వారితో పాటు ఎస్పీ నేత శివ‌పాల్ యాదవ్ కూడా అక్క‌డి జైలు  దగ్గ‌రికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాము సంతోషానికి, దుఃఖానికి సహచరులమని అన్నారు. తాము ఇద్ద‌రం మేము సోషలిస్టులమని అన్నారు. సుఖ దుఃఖంలో ఆదుకోవాలని త‌మ‌కు ములాయం సింగ్ యాదవ్ చెప్పార‌ని అన్నారు. అయితే అఖిలేష్ యాదవ్ ఆజం ఖాన్‌ను కలుస్తారా లేదా అని మీడియా ప్ర‌శ్నించిన‌ప్పుడు.. ఇదే విష‌యాన్ని అఖిలేష్ ను అడ‌గాల‌ని స‌మాధానం ఇచ్చారు. వీరి వెంట బిలారీ ఎస్పీ ఎమ్మెల్యే మహ్మద్. అబ్దుల్లా ఆజంతో పాటు ఫహీమ్ కూడా ఉన్నారు. 

JP Nadda: అన్నా-చెల్లెల పార్టీ అది.. కాంగ్రెస్ పై జేపీ న‌డ్డా ఘాటు విమ‌ర్శ‌లు

కోర్టు ఏం చెప్పిందంటే.. 
ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన చీటింగ్ కేసులో అజం ఖాన్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బిఆర్ గవాయి, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాల వ్యవధిలో సంబంధిత కోర్టు ముందు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్‌ను సంబంధిత న్యాయస్థానం నిర్ణయించే వరకు మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని సుప్రీం కోర్టు హామీ ఇచ్చింది. “ రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అందించిన అధికారాలను ఉపయోగించుకోవడానికి ఇది సరైన కేసు” అని బెంచ్ పేర్కొంది

click me!