నా పిల్ల‌ల Instagram Accounts Hack చేశారు.. ప్రియాంక గాంధీ సంచల‌న ఆరోప‌ణ‌లు

Published : Dec 21, 2021, 08:41 PM ISTUpdated : Dec 21, 2021, 08:42 PM IST
నా పిల్ల‌ల Instagram Accounts Hack చేశారు.. ప్రియాంక గాంధీ సంచల‌న ఆరోప‌ణ‌లు

సారాంశం

యూపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) సంచ‌ల‌న  ఆరోపణలు చేశారు. విపక్షాలపై అధికార ప‌క్షాలు ముందస్తు దాడులు పాల్ప‌డుతున్నార‌నీ, అందులో భాగంగానే  తమ పిల్లల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా ప్ర‌త్యార్థుల  సోషల్ మీడియా కార్యకలాపాలపైనా ప్రభుత్వం నిఘా పెట్టింద‌ని ఆరోపించారు.  

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయాలు వేడుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన రాజకీయ పార్టీల మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నికల స‌మీపిస్తోన్న కొద్దీ అధికార పార్టీ విపక్షాలపై ముందస్తు దాడులు చేస్తోంద‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలో తమ పిల్లలు మిరాయా (18), రైహాన్ (20) ల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని సంచ‌ల‌న ఆరోపించారు.

అధికార పార్టీ .. త‌న ప్ర‌త్య‌ర్థుల ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాకుండా వారి సోషల్ మీడియా కార్యకలాపాలపైనా కూడా  నిఘా పెడుతోందని ఆరోపించారు. బీజేపీ కి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని, అందుకే ఇలాంటి దుష్చ‌ర్యాల‌ను పాల్ప‌డుతోందని విమ‌ర్శించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు స‌మీపిస్తోన్న కొద్ది రాజ‌కీయాలు రోజురోజుకు వేడుతున్నాయి. ఎలాగైనా ఓటర్ల‌ను త‌మ వ‌శం చేసుకోవాల‌ని  తీవ్రంగా శ్ర‌మిస్తోన్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు వ్యూహ,   ప్ర‌తి వ్యూహాల‌తో  బిబీబిజీగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో చిన్న పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నిస్తున్నాయి. 

Read Also: Rahul Gandhi: మోడీ స‌ర్కారు ఏర్ప‌డ్డాకే మూకదాడులు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

గత ఎన్నికలలో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసినా.. కాంగ్రెస్ ఈ సారి యూపీ పీఠాన్ని అధిష్టాన్ని అధిరోయించాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ ఇన్‌చార్జిగా  ప్రియాంక‌ గాంధీ (Priyanka Gandhi )  వ్య‌వ‌హ‌రిస్తోన్నారు.  ఆమె ఉత్తర ప్రదేశ్‌లో మహిళా ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. గత కొన్ని నెలల నుంచి మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాదు, మహిళల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ హస్తం పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది.

Read Also: 21 ఏళ్లు లేని వయోజన పురుషులు పెళ్లి చేసుకోలేరు.. కానీ సమ్మతించే భాగస్వామితో కలిసి జీవించొచ్చు.. హైకోర్టు

ఈ రాష్ట్రంలో స‌గానికి పైగా.. మహిళా ఉండ‌టంతో వారిని టార్గెట్ చేసింది ప్రియాంక‌ (Priyanka Gandhi) .  మ‌హిళ‌ల‌కు అను గుణంగానే ఆమె తన రాజకీయ కార్యక్రమాలు..ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ క్ర‌మంలో  మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్న‌ట్లు  “పింక్‌ మ్యానిఫెస్టో” ను విడుద‌ల చేసింది కాంగ్రెస్ ఇంచార్జీ.   ఈ క్ర‌మంలో  లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్' నినాదాన్ని ప్ర‌చారంలోకి తెచ్చారు.  

Read Also:  మతం ఉన్మాద స్థాయికి వెళ్తే ప్రమాదం.. ఆలయాలను కూలగొట్టి ఏం సాధించారు: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) రూపొందించిన పింక్ మ్యానిఫెస్టో పూర్తిగా మహిళల కోస‌మే. ఇందులో ఆరు సెక్షన్లు ఉన్నాయి. మహిళల ఆత్మగౌరవం, గౌరవం, స్వావలంబన, విద్య, భద్రత, ఆరోగ్యం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 12వ తరగతి బాలికలకు స్కూటర్, మొబైల్ ఫోన్, ఆశా వర్కర్ల జీతం 10,000 కు పెంచాలని ప్రతిపాదించింది. అలాగే ఎన్నికల్లో 40శాతం మంది మహిళా అభ్యర్థును బరిలో దించుతామని ప్రియాంక ప్ర‌కటించారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu