హెచ్3ఎన్2 వైరస్ టెన్షన్.. పుదుచ్చేరిలో రేపటి నుంచి 10 రోజులు స్కూళ్లకు సెలవులు..

Published : Mar 15, 2023, 03:44 PM IST
హెచ్3ఎన్2 వైరస్ టెన్షన్.. పుదుచ్చేరిలో రేపటి నుంచి 10 రోజులు స్కూళ్లకు సెలవులు..

సారాంశం

హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇప్పటి వరకు 79 కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ చిన్నారులపై, వృద్ధులపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుండటంతో పది రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 

హెచ్3ఎన్2 వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలోని అన్ని పాఠశాలలను పది రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. వైరస్ వ్యాప్తి వల్ల మార్చి 16 నుంచి 26 అన్ని పాఠశాలకు సెలవులు ఇస్తున్నట్టు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ఎ.నమశివాయం బుధవారం ప్రకటించారు. 

ఎలిఫెంట్ విస్పరన్ కు ఆస్కార్ ... బొమ్మన్, బెల్లి దంపతులకు సీఎం స్టాలిన్ ఆర్థికసాయం

‘ది లైవ్ మింట్’ నివేదిక ప్రకారం.. మార్చి 11వ తేదీ వరకు కేంద్రపాలిత ప్రాంతంలో 79 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. కానీ పెరుగుతున్న కేసులను అదుపులోకి తీసుకురావడానికి ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని ఆరోగ్య శాఖ పకడ్బంధీగా చర్యలు తీసుకుంటోంది. ఇన్ ఫ్లూయెంజా చికిత్స కోసం హాస్పిటల్స్ లోని ఔట్ పేషెంట్ విభాగాల్లో ప్రత్యేక బూత్ లను కూడా యూటీ ప్రారంభించింది. వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని రాజకీయ పార్టీలు, తల్లిదండ్రులతో పాటు పలు వర్గాల నుంచి డిమాండ్ రావడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

అదానీ వివాదం.. పార్లమెంట్ నుంచి ఈడీ ఆఫీసుకు ప్రతిపక్షాల ర్యాలీ.. విజయ్ చౌక్ వద్ద అడ్డుకున్న పోలీసులు

హెచ్3ఎన్2 వైరస్ చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవడంతో పాటు ఇతర అన్ని నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హెచ్3ఎన్2 వైరస్ బారిన పడిన కొందరు రోగుల్లో ఊపిరితిత్తుల్లోకి మరింత ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోందని పేర్కొంటున్నారు. దీనివల్ల న్యుమోనియా వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో ఈ వైరస్ వల్ల పరిస్థితి తీవ్రమైనప్పుడు వారిని హాస్పిటల్ లో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. 

కాగా.. హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇప్పటి వరకు కర్ణాటకలో ఒకరు, హరియాణాలో మరొకరు మృతి చెందారు. మరో ఘటనలో గుజరాత్ లోని వడోదర నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫ్లూ వంటి లక్షణాలతో 58 ఏళ్ల మహిళ మరణించింది. తాజాగా మహారాష్ట్రలో కూడా తొలి అనుమానిత మరణం నమోదైంది.

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు - బీజేపీ డిమాండ్ పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

హెచ్3ఎన్2 కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం అయ్యింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) నెట్ వర్క్ ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కాలానుగుణ ఇన్ ఫ్లూయెంజా పరిస్థితిని రియల్ టైమ్ ప్రాతిపదికన నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వైరస్ రోగుల వర్గీకరణ, చికిత్స ప్రోటోకాల్, వెంటిలేటర్ నిర్వహణపై మార్గదర్శకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించింది. ఈ మార్గదర్శకాలు కేంద్ర మంత్రిత్వ శాఖ, ఎన్సీడీసీ వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !