
భారీ పోలీసు బందోబస్తు, బారికేడ్ల మధ్య అదానీ గ్రూప్ పై ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు దేశ రాజధానిలోని పార్లమెంటు కాంప్లెక్స్ నుండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని ప్రారంభించారు. అయితీ ఈ ర్యాలీని విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ విధించి ముందుకు కదలకుండా అడ్డుకున్నారు.
స్లిప్పర్స్ లో దాచి కిలోకు పైగా బంగారం స్మగ్లింగ్.. బెంగుళూరు ఎయిర్ పోర్టులో పట్టుబడిన వ్యక్తి...
మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలో మొత్తం 16 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఇందులో కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్), ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మరుమలాచి ద్రవిడ మున్నేట్ర కజగం, నేషనల్ కాన్ఫరెన్స్, విడుతలై చిరుతైగళ్ కట్చి ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ మార్చ్ లో పాల్గొనలేదు.
అదానీ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని తాము డిమాండ్ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే పోలీసులు తమను ముందుకు వెళ్లనివ్వడం లేదని ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పోలీసులు ర్యాలీని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సభ్యులంతా తిరిగి పార్లమెంట్ కు చేరుకున్నారు. కాగా..ఈ మార్చ్ కు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పార్లమెంటు ఛాంబర్ లో విపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ అంశంపై వ్యూహాన్ని సమన్వయం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ర్యాలీలో టీఎంసీ పాల్గొనలేదు. ఎల్ పీజీ ధరల పెంపుపై తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు కాంప్లెక్స్‌లోని గాంధీ విగ్రహం ముందు విడివిడిగా నిరసన చేపట్టింది. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. పార్లమెంటులో తమ సమస్యలు, ఎజెండాపై నిరసన తెలుపుతామని చెప్పారు. తమ రాష్ట్రం (బెంగాల్)లో కాంగ్రెస్ పూర్తిగా బీజేపీ, సీపీఎంలతో కుమ్మక్కైందని, అందువల్ల కాంగ్రెస్ నేతలు పిలిచిన సమావేశాలతో తాము చేతులు కలపలేమని ఆయన అన్నారు.
బోర్‌వెల్‌లో పడిన 8 ఏళ్ల బాలుడు మృతి.. 24 గంటలుగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్..
కాగా.. అదానీ-హిండెన్‌బర్గ్ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీపీ) విచారణకు గత కొంత కాలంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే డిమాండ్ పై పార్లమెంటు కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. అదానీ గ్రూప్ ‘‘బ్రజాన్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్‌లో నిమగ్నమైందని’’ ఆరోపించింది. స్టాక్ ధరలను పెంచడానికి ఆఫ్‌షోర్ షెల్ కంపెనీలను ఉపయోగించుకుందని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.