జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు: శివలింగానికి రక్షణ ఇవ్వాలి, నమాజ్‌కి అనుమతి

Published : May 17, 2022, 05:33 PM ISTUpdated : May 17, 2022, 05:52 PM IST
జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక ఆదేశాలు: శివలింగానికి రక్షణ ఇవ్వాలి, నమాజ్‌కి అనుమతి

సారాంశం

 జ్ఞానవాపి  మసీదులో శివలింగం లభించిన ప్రాంతాన్ని రక్షించాలని యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది.  మరో వైపు ముస్లింలు ఈ ప్రాంతంలో నమాజ్ చేసుకొనేందుకు కూడా అనుమతిని ఇచ్చింది. 

న్యూఢిల్లీ: Uttar Pradesh రాష్ట్రంలోని varanasiలో గల  Gyanvapi Mosque కాంప్లెక్స్ లో గల బావిలో Shivling బయటపడిన ప్రాంతాన్ని సంరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని Supreme Courtఆదేశించింది. 

మంగళవారం నాడు  సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసులో ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.  వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పులో రెండు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

also read:Asaduddin Owaisi: " ఇది 1991 చట్టాన్ని ఉల్లంఘించడమే".. వారణాసి కోర్టు తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం

 డివై చంద్రచూడ్, నర్సింహలలతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడు  కీలక ఆదేశాలు ఇచ్చింది.  మరో వైపు Namaz చేసుకొనేందుకు కూడా Muslimsలకు అనుమతిని ఇచ్చింది.  వారణాసి మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుల్లో కొన్నింటికి సవరణలు ఇచ్చింది.  రెండింటిపై స్టే కూడా విధించింది. 

వారణాసి కోర్టు మాత్రం 20 మంది మాత్రమే నమాజ్ చేసుకొనేందుకు  అనుమతి ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎంతమందైనా నమాజ్ చేసుకొనేందుకు అనుమతిని  ఇచ్చింది.  ఈ  కేసు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పిటిషన్ దాఖలు చేసిన వారికి  నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది.

వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీద్‌ కాంప్లెక్స్‌లో వీడియోగ్రాఫిక్‌ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమాన్‌ ఇంతెజమీయా మసీద్‌ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మంగళవారం  విచారించి ఈ ఆదేశాలు జారీ చేసింది.  పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది హుఫేజా అహ్మది వాదనలు వినిపించారు.

మసీదు కమిటీ తరపు సీనియర్ న్యాయవాది అహ్మదీ వాదించారు., కమిషనర్ నియామకంతో సహా ట్రయల్ కోర్టు యొక్క అన్ని ఉత్తర్వులపై స్టేను కోరుతున్నట్లు తెలిపారు. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా,  పార్లమెంటుకు విరుద్ధంగా ఉన్నందున ‘స్టేటస్ కో’కు ఆదేశించాలని కోరారు. అంతేకాదు పిటిషనర్ల ఉద్దేశం మసీదును మాయ చేసే కుట్రగా స్పష్టం అవుతోందంటూ కోర్టుకు తెలిపారు.

వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించలేదు.శివలింగం ఉన్నట్టు నివేదించిన ప్రదేశానికి తగిన రక్షణ కల్పించాలని డీఎం వారణాసిని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయాన్ని వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించిన వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజుమియా మసాజిద్ వేసిన పిటిషన్ పై హిందూ పిటిషనర్లు,యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ లోపుగా సమాధానాలు దాఖలు చేయాల్సి ఉంటుంది.

మరోవైపు ఈ కేసులో వీడియోగ్రఫీ సర్వే రిపోర్టును మీడియాకు బయటపెట్టిన అజయ్ మిశ్రాను సర్వే రిపోర్టు నుండి కోర్టు తప్పించింది. మరో వైపు సర్వేను పూర్తి చేసేందుకు గాను  రెండు రోజుల సమయాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?