భగత్ సింగ్ ను బీజేపీ ఎందుకు ద్వేషిస్తోంది ?.. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

Published : May 17, 2022, 03:29 PM ISTUpdated : May 17, 2022, 03:33 PM IST
భగత్ సింగ్ ను బీజేపీ ఎందుకు ద్వేషిస్తోంది ?.. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

సారాంశం

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటక బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ పాఠ్య పుస్తకాల నుంచి భగత్ సింగ్ కు సంబంధించిన పాఠం తొలగించడం సరైంది కాదని అన్నారు. 

స్కూల్ బుక్స్ నుంచి భగత్ సింగ్ కు సంబంధించిన ఒక పాఠాన్ని తొలగించినట్లు వచ్చిన వార్తలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటకలోని బీజేపీ ప్ర‌భుత్వంపై విరుచుకుపడ్డారు.ఆ నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకోవాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని మంగ‌ళ‌వారం ఆయ‌న అభ్య‌ర్థించారు. అమరవీరులను అవమానించడాన్ని దేశం సహించబోదని అన్నారు. భ‌గ‌త్ సింగ్ ను బీజేపీ ఎందుకు అంతగా ఇష్ట‌ప‌డ‌ద‌ని ప్ర‌శ్నించారు.  

‘భయంకర కలలు వస్తున్నాయ్’.. దొంగిలించిన ఆలయ విగ్రహాలు వెనక్కి

కర్ణాటక ప్రభుత్వం భగత్ సింగ్‌పై పాఠాన్ని తొల‌గించి, ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగాన్ని చేర్చింద‌ని ఆల్-ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIIDSO), ఆల్-ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (AISEC) సహా కొన్ని సంస్థలు ప్ర‌క‌ట‌న‌లు చేసిన ఒక రోజు త‌రువాత ఆయ‌న ఈ విధంగా స్పందించారు. అమర్ షహీద్ సర్దార్ భగత్ సింగ్ బీజేపీ నాయ‌కులు ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని అన్నారు. పాఠశాల పుస్తకాల నుంచి సర్దార్ భగత్ సింగ్ పేరును తొలగించడం అమర్ షహీద్ త్యాగాన్ని అవమానించడమే అవుతుంద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. 

అమరవీరులను అవమానించడాన్ని దేశం అస్సలు సహించబోదని ఢిల్లీ సీఎం అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘ సిగ్గుచేటు.. భగత్ సింగ్ పై స్కూల్ బుక్స్ నుంచి అధ్యాయాన్ని బీజేపీ కర్ణాటక ప్రభుత్వం తొలగించింది. షహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ను బీజేపీ ఎందుకు అంతగా ద్వేషిస్తుంది? బీజేపీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మన స్వాతంత్ర సమరయోధులకు ఇలాంటి అవమానాన్ని భారత్ సహించదు’’ అని ఆప్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసింది.  

gyanvapi masjid case: జ్ఞాన్‌వాపీ మసీదు కేసుపై విచారణ ప్రారంభించిన సుప్రీం.. తీర్పుపై ఉత్కంఠ

అయితే పదవ తరగతి విద్యార్థుల కన్నడ పాఠ్యపుస్తకంలో హెడ్గేవార్ ప్రసంగాన్ని చేర్చడాన్ని కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ సమర్థించారు. ఈ పాఠ్యపుస్తకం హెడ్గేవార్ లేదా ఆర్ఎస్ఎస్ గురించి కాదని, ప్రజలను, ముఖ్యంగా యువతను ప్రేరేపించడానికి మాత్రమే అని అన్నారు. ఆ అంశంలో మాత్రమే హెడ్డేవార్ ప్రసంగం ఉందని అన్నారు. పాఠ్య పుస్తకం సవరణపై ప్రశ్నించిన వారు ఆ అంశాన్ని చదవలేదని నగేష్ నొక్కి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!