ఆర్థర్ రోడ్ జైలులో తోటి ఖైదీకి లైంగిక వేధింపులు.. 19 ఏళ్ల యువకుడిపై కేసు..

Published : May 17, 2022, 03:37 PM IST
ఆర్థర్ రోడ్ జైలులో తోటి ఖైదీకి లైంగిక వేధింపులు.. 19 ఏళ్ల యువకుడిపై కేసు..

సారాంశం

ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జైలులో ఓ ఖైదీని తన తోటి ఖైదీ లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతనిపై దాడి కూడా చేశాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరింపులకు గురిచేశాడు. 

ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జైలులో ఓ ఖైదీని తన తోటి ఖైదీ లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతనిపై దాడి కూడా చేశాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరింపులకు గురిచేశాడు. ఈ ఘటనకు సంబంధించి ముంబైలోని ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది. నిందితుడిని త్వరలో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక, నిందితుడి వయసు 19 ఏళ్లు కాగా, అతడి నుంచి బాధితుడి వయసు 20 ఏళ్లుగా ఉంది. వేర్వేరు నేరారోపణల కింద జైలులో ఉన్న వారిద్దరు.. గత రెండు నెలలుగా ఒకే బ్యారక్‌లో ఉన్నారు.

ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ.. ‘‘ఆదివారం తెల్లవారుజామున జైలులోని ఒక బ్యారక్‌లో ఉన్న నిందితుడు.. బాధితుడి వద్దకు వచ్చాడు. తెల్లవారుజామున 2.30 - 3.30 గంటల మధ్య అతనితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత బలవంతంగా బాధితుడిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటనను ఎవరికీ చెప్పవద్దని బెదిరింపుకు పాల్పడ్డాడు. ఈ పరిమాణాలతో బాధితుడు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఆ తర్వాత జైలు గార్డులకు అతని బాధను వివరించాడు. 

దీంతో జైలు గార్డులు ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్‌కు తెలిపారు. దీంతో జైలు సూపరింటెండెంట్ స్థానిక ఎన్ ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆర్థర్ రోడ్ జైలును సందర్శించి బాధితుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు’’ అని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..