child trafficking: పిల్లల అక్రమ రవాణా.. ఐదుగురు పిల్లల్ని రక్షించిన పోలీసులు

By Mahesh RajamoniFirst Published Jan 23, 2022, 11:54 PM IST
Highlights

child trafficking: దేశంలో మాన‌వ అక్ర‌మ ర‌వాణా తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా బాలిక‌లు, చిన్న‌పిల్ల‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప‌లు ముఠాలు మానవ అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ లో చిన్న‌పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా (child trafficking)కు పాల్ప‌డుతూ.. సెక్స్ ట్రేడ్ రాకెట్ తో సంబంధం క‌లిగిన ఓ ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. 

child trafficking: దేశంలో మాన‌వ అక్ర‌మ ర‌వాణా తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా బాలిక‌లు, చిన్న‌పిల్ల‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ప‌లు ముఠాలు మానవ అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ లో చిన్న‌పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా (child trafficking) కు పాల్ప‌డుతూ.. సెక్స్ ట్రేడ్ రాకెట్ తో సంబంధం క‌లిగిన ఓ ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. వారి నుంచి ఐదుగురు బాలిక‌ల‌ను ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. మానవ అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్న ఈ గ్యాంగ్ నుంచి ఐదుగురు చిన్నారుల‌ను ర‌క్షించారు పోలీసులు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్త‌రాది రాష్ట్రమైన రాజ‌స్థాన్ లో గ‌త కొంత కాలంగా మానవ అక్ర‌మ ర‌వాణా (child trafficking) క‌ల‌క‌లం రేపుతున్న‌ది. సెక్స్ ట్రేడ్ రాకెట్ సంబంధం క‌లిగిన వ్య‌క్తులు పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్నారు. ఈ విధంగా తీసుకువ‌చ్చిన పిల్ల‌ల‌ను రాజ‌స్థాన్ లోని చాలా ప్రాంతాల్లో సెక్స్ రాకెట్ నడుపుతున్న దుండ‌గులు కొనుగొలు చేసుకుంటున్నారు. అలాగే, శిశువులను వివిధ ప్రాంతాల్లో పిల్లలు లేని లేని వారికి విక్రయిస్తున్నారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ (child trafficking) లో బాలుర కంటే బాలిక‌లే అధికంగా ఉన్నారు. గురుగ్రామ్ లో పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు గ‌త కొన్ని రోజులుగా వీటిపై నిఘా పెట్టారు. క్యాబ్ డ్రైవ‌ర్ల సహాయంతో పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్న ముఠాను ఛేదించారు పోలీసులు. ఈ ముఠాలోని 14 మందిని గాలం వేసి ప‌ట్టుకున్నారు.  వీరి (child trafficking) చేర‌నుంచి ర‌క్షించిన పిల్ల‌ల‌ను తీసుకోవ‌డానికి ఎవ‌రు కూడా పోలీసుల‌ను సంప్ర‌దించ‌క‌పోవ‌డంతో వారిని న‌గ‌రంలోని శిశు సంర‌క్ష‌ణ కేంద్రంలో ఉంచారు. 

14 మందికి పైగా దుండ‌గుల‌తో కూడిన ఈ చిన్నారుల అక్ర‌మ ర‌వాణా (child trafficking) ముఠా గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న‌ద‌ని విచార‌ణ‌లో తేలింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలను పెంచలేని నిరుపేద దంపతులను ముందుగా ముఠా టార్గెట్ చేసుకుంటుంది. ఆ త‌ర్వాత వారికి డ‌బ్బును ఆశ‌జూపి పిల్ల‌ల‌ను కోనుగోలు చేస్తుంది. పిల్ల‌ల ధ‌ర వారి  చర్మం రంగుపై ఆధారపడి ఉంటుంద‌నీ, ఉదాహరణకు, శిశువు  మంచి తెలుపు రంగు ఛాయతో ఉంటే ఒక‌రేటు.. ముదురు రంగుతో ఉంటే ఒక‌రేటు.. ఇలా ఒక్కొక్కిరిక ఒక్కో రేటు ఇచ్చి పిల్ల‌ల అక్ర‌మ రవాణాకు పాల్ప‌డుతున్న‌ట్టు పోలీసుల విచార‌ణలో వెల్ల‌డైంది. చైల్డ్ ట్రాఫికింగ్ (child trafficking) కు పిల్ల‌ల‌ను గుర్తించిన తర్వాత, వారి ఫొటోలు వివిధ రాష్ట్రాల్లోని ముఠా సభ్యుల పంచుకుని పిల్ల‌ల అక్ర‌మ రవాణాకు పాల్ప‌డుతున్నారు. శిశువులను అయితే, పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారు. అలాగే, బాలికలు, బాలురను సెక్స్ ట్రేడ్ రాకెట్ తో సంబంధం క‌లిగిన మరి కొన్ని ముఠాలకు వీరిని అమ్మెస్తున్నారు. 

పోలీసులు మాట్లాడుతూ, "మేము చిన్న పిల్ల‌ల‌ను రక్షించాము, కానీ వారిని తీసుకోవ‌డానికి ఎవరూ ముందుకు రాలేదు. వారు ఇప్పుడు పిల్లల సంరక్షణ కేంద్రంలో ఉన్నారు" అని తెలిపారు. పిల్ల‌ల ట్రాఫికింగ్ (child trafficking) గ‌త కొంత కాలంగా న‌గ‌రంలో కొన‌సాగుతున్న‌ద‌ని స‌మాచారం అంద‌డంతో దీనిపై దృష్టి సారించామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను ఛేదించామ‌ని తెలిపారు.

click me!