
గుజరాత్‌కు సీఎంగా పనిచేసే అవకాశం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు విజయ్ రూపానీ. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా గుజరాత్ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని విజయ్ రూపానీ చెప్పారు. మోడీ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని రూపానీ జోస్యం చెప్పారు. సీఎం ఎవరైనా ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేస్తామన్నారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని.. తామంతా కలిసే ఉన్నామని విజయ్ రూపాన్నీ చెప్పారు. కార్యకర్తగా పార్టీకి ఎప్పుడూ సేవ చేస్తామన్నారు.
ALso ReadL:బ్రేకింగ్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా
రూపానీ రాజీనామాతో గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తర్వాత సీఎంను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే మంగళవారం సమావేశం కానున్నట్లు సమచారం. సీఎం రేసులో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది డిసెంబరులో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.