నూతన దంపతులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే మ్యారేజ్ సర్టిఫికేట్ పొందవచ్చన్న హైకోర్టు

By telugu teamFirst Published Sep 11, 2021, 5:02 PM IST
Highlights

నూతన దంపతులు తమ పెళ్లిని ఆన్‌లైన్‌లో హాజరై కూడా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది. అమెరికాలోని దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారిస్తూ ఈ నిర్ణయాలను ప్రకటించింది. ఢిల్లీ(కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్) ఆదేశాలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
 

న్యూఢిల్లీ: నూతన దంపతులకు ఢిల్లీ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లి చేసుకున్న తర్వాతి దాన్ని నమోదు చేసుకోవడానికి ప్రత్యక్షంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే తమ పెళ్లి నమోదు చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ పొందవచ్చని, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దంపతులు హాజరైన సరిపోతుందని సంచలన ఆదేశాలను వెలువరించింది.

2001లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన దంపతులు ఇప్పుడు గ్రీన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. కానీ, దానికోసం ఇండియాకు వచ్చి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి లేదు. బంధువుల ద్వారా ఇక్కడ దరఖాస్తు చేయించడానికి ప్రయత్నిస్తే అధికారులు దంపతులు కచ్చితంగా ప్రత్యక్షంగా హాజరవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. తాము పెళ్లి చేసుకున్నప్పుడు ఢిల్లీ(కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్) ఆదేశాలు లేవని, ఇప్పుడు తీసుకోవడం కష్టమవుతున్నదని పిటిషనర్లు వాదించారు.

ఈ పిటిషన్‌ను జస్టిస్ రేఖా పల్లి విచారించారు. రిజిస్ట్రేషన్ ఆర్డర్‌లోని క్లాస్ 4 ప్రకారం దంపతులు ప్రత్యక్షంగా హాజరవ్వాలని, కానీ, దాన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరవడంగానూ చదవడానికి తనకు ఇబ్బంది లేదని తెలిపారు. దీన్ని కూడదంటే తీసుకువచ్చిన చట్టమే పక్కదారి పడుతుందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా దంపతులు సులువుగా మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

click me!