కోల్ స్కాం: మమతా బెనర్జీ మేనల్లుడికి మరోసారి ఈడీ సమన్లు

By Siva KodatiFirst Published Sep 11, 2021, 4:47 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. బెంగాల్ బొగ్గు స్కామ్ లో ఆయనకు శనివారం నోటీసులుపంపించింది. సెప్టెంబర్ 21న విచారణకు హాజరు కావాలని సమన్లలో ఆదేశాలు జారీ చేసింది.
 
వాస్తవానికి నిన్ననే ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అభిషేక్ బెనర్జీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు హాజరుకావాలంటూ తనకు అతి తక్కువ సమయాన్ని ఇచ్చారని... అందువల్ల తాను హాజరు కాలేనని ఈడీకి ఆయన తెలియజేశారు. దీంతో సెప్టెంబర్ 21న విచారణకు రావాలని తాజాగా ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది.

ఇదిలావుంచితే, ఇప్పటికే ఆయన ఈ కేసులో సెప్టెంబర్ 6న ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఈడీ అధికారులు ఆయనను ఎనిమిది గంటలకు పైగా విచారించారు. ఆ తర్వాత మీడియాతో అభిషేక్ మాట్లాడుతూ, విచారణకు తాను అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. కేసు కోల్ కతాకు చెందినదని... అయినప్పటికీ తనకు ఢిల్లీ నుంచి సమన్లు జారీ చేస్తున్నారని అభిషేక్ విమర్శించారు. గత నవంబర్ లో తాను చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నానని... తాను తప్పు చేసినట్టు కేంద్ర విచారణ ఏజెన్సీ నిరూపిస్తే బహిరంగంగా పోడియంలో ఉరి వేసుకుని చనిపోతానని చెప్పారు

click me!