సరిహద్దులో ఉద్రికత్తల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం.. రూ. 4,276 కోట్ల క్షిపణులు, ఆయుధాల కొనుగోలు ఆమోదం

By Rajesh KarampooriFirst Published Jan 11, 2023, 4:01 AM IST
Highlights

చైనా, పాకిస్థాన్ సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మూడు మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశం జరిగినట్లు మంత్రిత్వ శాఖ సమాచారం.

చైనా, పాకిస్థాన్ సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణులు, వాయు రక్షణ ఆయుధాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) సమావేశం ఆమోదం తెలిపింది. స్వదేశీ హెలికాప్టర్‌తో ప్రయోగించే యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, వాయు రక్షణ ఆయుధాలు, బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో తమ యుద్ధనౌకలను సమకూర్చుకునేందుకు ఆర్మీ, నేవీ రూ.4,276 కోట్ల విలువైన మూడు ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.
 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశం జరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమయంలో భారత సైన్యం యొక్క రెండు మూలధన సేకరణ ప్రతిపాదనలు , భారత నౌకాదళం యొక్క ఒక్క  ప్రతిపాదన ఆమోదించబడింది. ఈ మూడు మూలధన సేకరణ ప్రతిపాదనల విలువ రూ.4,276 కోట్లు. ఈ మొత్తంతో శత్రు విమానాలను కూల్చివేసేందుకు స్వదేశీ హెలీనా యాంటీ ట్యాంక్ క్షిపణి , వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వేచించనున్నారు.  

ఈ క్రమంలో హెలీనా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, లాంచర్, అనుబంధ ఉపకరణాల సేకరణ కోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)లో ఈ పరికరాలను అమర్చారు. శత్రు ముప్పును ఎదుర్కోవడానికి ALH యొక్క ఆయుధంలో క్షిపణి కీలక ప్రాత పోషించనున్నది. దీని ప్రవేశంతో భారత సైన్యం యొక్క సామర్థ్యం మరింత బలోపేతం కానున్నదని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, హెలీనా, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)తో అనుసంధానించబడి ఏడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదని అధికారులు తెలిపారు. భారతదేశం యొక్క అపెక్స్ ప్రొక్యూర్‌మెంట్ బాడీ అయిన డిఎసి, ఫైర్ అండ్ ఫర్‌గెట్ హెలీనా క్షిపణి, లాంచర్, అనుబంధ ఉపకరణాల కోసం యాక్సెప్టెన్స్ ఆఫ్ రిక్వైర్‌మెంట్స్ (AoN)ని అంగీకరించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అదనంగా.. DRDO రూపొందించి, అభివృద్ధి చేసిన వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS)సేకరణను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. ఉత్తర సరిహద్దుల వెంబడి ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ (ఎడి) ఆయుధ వ్యవస్థలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. VSHORAD ఆయుధాన్ని  భూభాగంలో, సముద్ర ప్రాంతంలో వేగంగా మోహరించవచ్చు. నేవీకి సంబంధించిన ప్రతిపాదనను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కూడా ఆమోదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని కింద శివలిక్ క్లాస్ షిప్‌ల కోసం బ్రహ్మోస్ లాంచర్ , ఫైర్ కంట్రోల్ సిస్టమ్ (FCS) , భారత నావికాదళం కోసం నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్ వెసెల్స్ (ఎన్‌జిఎంవి)ని కొనుగోలుకు DAC ఆమోదం లభించింది.  

 చైనా సరిహద్దులో ప్రతిష్టంభన 

విశేషమేమిటంటే.. మే 2020 నుండి భారత్ - చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొంది. గత డిసెంబర్‌లో కూడా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అటువంటి పరిస్థితిలో.. ఫిరంగి తుపాకులు, సమూహ డ్రోన్ వ్యవస్థలు, దీర్ఘ-శ్రేణి రాకెట్లు, రిమోట్‌గా పనిచేసే ఎయిర్ సిస్టమ్‌లు, హై-మొబిలిటీ రక్షిత వాహనాలతో సహా అనేక రకాల ఆయుధాలను కలిగి ఉన్న చైనా సరిహద్దులో సైన్యం తన సామర్థ్యాన్ని వేగంగా అభివృద్ధి చేస్తోంది.

click me!