
రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నానో డీఏపీ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం ప్రకటించారు. రైతుల ప్రయోజనాల కోసం, దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు నానో లిక్విడ్ డీఏపీ (డి-అమోనియం ఫాస్ఫేట్) ఎరువులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.
కొవిడ్ తరహా లక్షణాలతో దేశవ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు.. నిపుణులు చెప్పే సలహాలివే
2021 లో నానో లిక్విడ్ యూరియాను ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ ఇఫ్కో తన నానో డీఏపీ ఎరువును మార్కెట్ లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నానో యూరియా తర్వాత ఇప్పుడు నానో డీఏపీకి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మాండవీయ ట్వీట్ చేశారు. ఎరువుల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇది మరో విజయమని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని మాండవీయ తెలిపారు.
ఇఫ్కో నానో డీఏపీని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోదించిందని, దాని ప్రోత్సాహక ఫలితాల ఆధారంగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సీఓ)లో నోటిఫై చేసిందని ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ యూఎస్ అవస్థి శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘ ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీ భారత వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు గేమ్ ఛేంజర్’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ మాగుంట కొడుకుకు కస్టడీ పొడింగించిన కోర్టు..
కాగా.. ప్రస్తుతం రూ.1,350గా ఉన్న ఒక డీఏపీ బస్తాతో త్వరలో అందుబాటులోకి రానున్న బాటిల్ నానో డీఏపీ సమానం. అయితే నానో పొటాష్, నానో జింక్, నానో కాపర్ ఎరువులను కూడా ఇఫ్కో విడుదల చేయనుంది. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా 2021 జూన్ లో ఇఫ్కో నానో యూరియాను ద్రవ రూపంలో విడుదల చేసింది. నానో యూరియాను ఉత్పత్తి చేసేందుకు గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో పలు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. కాగా దేశంలో యూరియా తర్వాత అత్యధికంగా ఉపయోగించే ఎరువులలో డీఏపీ ఒకటి.
నానో యూరియాపై ప్రభుత్వ సబ్సిడీ లేదు. ఒక్కో బాటిల్ ధరను రూ.240కి విక్రయిస్తున్నారు. అయితే సంప్రదాయ యూరియాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తుంది. దేశంలో యూరియా ఉత్పత్తి సామర్థ్యం 26 మిలియన్ టన్నులు కాగా, 35 మిలియన్ టన్నుల డిమాండ్ ఉంది. ఈ లోటును దిగుమతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. భారత్ తన దేశీయ డిమాండ్ ను తీర్చడానికి డీఏపీ, ఎంవోపీ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్ )లను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది.