కొవిడ్ తరహా లక్షణాలతో దేశవ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు.. నిపుణులు చెప్పే సలహాలివే

Published : Mar 04, 2023, 02:54 PM IST
కొవిడ్ తరహా లక్షణాలతో దేశవ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు.. నిపుణులు చెప్పే సలహాలివే

సారాంశం

కొవిడ్ భయాలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్న తరుణంలో దేశవ్యాప్తంగా భారీగా ఫ్లూ కేసులు నమోదవుతుండటం ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. కొవిడ్ తరహా లక్షణాలతో వస్తున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా దీర్ఘకాలం బాధిస్తున్నది. ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఈ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని ఐసీఎంఆర్ తెలిపింది.   

న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. సాధారణంగా జలుబు దాదాపు ఒక వారంపాటు ఉంటుంది. కానీ, ఈ ఫ్లూ సోకిన పేషెంట్లలో రెండు, మూడు వారాలపాటు జలుబు ఉంటున్నది. అలాగే, విపరీతమైన దగ్గు ఉంటున్నది. ఫలితంగా గొంతు నొప్పి కూడా తీవ్రంగా ఉంటున్నది. వీటికితోడు జ్వరం కూడా వస్తున్నది. ఆ జ్వరమూ దీర్ఘకాలం వీడట్లేదు. కొవిడ్ తరహా లక్షణాలతో ఈ ఫ్లూ దేశవ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తున్నది. ఒక చోట నుంచి మరో చోటుకి వేగంగా వ్యాపిస్తున్నది. ఐసీఎంఆర్ దీనిపై స్పందించింది. ఇది ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ అని పేర్కొంది. కరోనా తరహా లక్షణాలు ఉండటం, దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో ఒకరకమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

హెచ్3ఎన్2 వైరస్ ఇతర సబ్ టైప్‌ల కంటే ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుందని, అందుకే ఈ వైరస్ సోకడంతో చాలా మంది హాస్పిటల్‌లో చేరాల్సి వస్తున్నది. గత రెండు మూడు నెలలుగా మన దేశంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్‌ఫ్లుయెంజా సోకిన వారిలో దగ్గు, జ్వరం దీర్ఘకాలం కొనసాగుతున్నాయని వివరించారు. దీర్ఘకాలం ఈ లక్షణాలు ఉంటున్నాయని పేషెంట్లు చెబుతున్నారు.

ఈ ఇన్‌ఫ్లుయెంజా నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతున్నదని సిద్ధ్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ అనురాగ్ మెహ్రోత్రా వివరించారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని, దీర్ఘకాలం కొనసాగుతున్నాయని అన్నారు. అంతేకాదు, పేషెంట్ రికవరీ అయినా కొందరిలో ఈ లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. అయితే, ఇది ప్రాణాంతకమైనదేమీ కాదని క్లినికల్ ట్రయల్ స్పెషలిస్ట్ డాక్టర్ అనితా రమేశ్ చెప్పారు. కానీ, శ్వాసకోశ సంబంధ సమ్యలతో పలువురు పేషెంట్లు హాస్పిటల్‌లో చేరుతున్నారని వివరించారు. కొన్ని లక్షణాలు చాలా వరకు కొవిడ్‌ను పోలి ఉంటున్నాయని, కానీ, తమ వద్దకు వచ్చిన పేషెంట్లు అందరికీ కరోనా నెగెటివ్ అనే వచ్చిందని పేర్కొన్నారు.

Also Read: రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ కు యాక్సిడెంట్.. భారీ ప్రమాదంతో ఆరు కార్లు ధ్వంసం (వీడియో)

ఇదిలా ఉండగా ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండటానికి ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. కాగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం ఇబ్బడిముబ్బడిగా యాంటీబయాటిక్స్ వాడొద్దని సూచించింది. లక్షణాలు చూసి సమస్యను గుర్తించి అందుకు సంబంధించిన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని, అదేమీ లేకుండా విచక్షణారహితంగా యాంటీ బయాటిక్స్ రిఫర్ చేయడం సరికాదని, ఇది ఇతర సమస్యలకు దారి తీస్తుందని తెలిపింది.

కాగా, ఫ్లూ సోకిన వ్యక్తి నుంచి ఇతర కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వాళ్లకు సులభంగా అది వ్యాపించే ముప్పు ఉంటుంది. కాబట్టి, ఫ్లూ సోకిన పేషెంట్‌ను కనీసం ఒక వారంపాటు ఐసొలేషన్‌లో ఉంచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, వారు మాస్క్ ధరించడం మంచిదని వివరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఫ్లూ చాలా వేగంగా ఇతరులకూ సోకే అవకాశం ఉన్నదని తెలిపారు.  ఫ్లూ సోకిన వారితో కాంటాక్ట్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !