Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?

By Mahesh K  |  First Published Jan 16, 2024, 9:25 PM IST

ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల ర్యాంక్‌లను గ్లోబల్ ఫైర్ పవర్ విడుదల చేసింది. అమెరికా తొలి స్థానంలో ఉండగా.. భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
 


Indian Army: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంక్‌లు విడుదలయ్యాయి. గ్లోబల్ ఫైర్ పవర్స్ మిలిటరీ స్ట్రెంథ్ ర్యాంకింగ్స్ 2024 పేరిట రిపోర్ట్‌ను గ్లోబల్ ఫైర్ పవర్ విడుదల చేసింది. మొత్తం 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంక్‌లుగా తేల్చింది. సైనికుల సంఖ్య, ఆయుధాలు, ఆర్థిక సుస్థిరత, భౌగోళిక స్థితి, వనరులు వంటి 60కిపైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంక్‌లను ఇచ్చింది. 

ఈ ర్యాంక్‌లో అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది.  ఆ తర్వాత రష్యా ఉన్నది. మూడో స్థానంలో చైనా నిలవగా.. భారత ఆర్మీ నాలుగో స్థానంలో ఉన్నది. భూటాన్ చివరిలో ఉన్నది.

Latest Videos

ఈ ర్యాంక్‌లను ఉన్నది ఉన్నట్టుగా తీసుకోలేం. దీనికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక శక్తి, లాజిస్టికల్ ఎఫీషియెన్సీ వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుని గ్లోబల్ ఫైర్ పవర్ వాస్తవానికి చాలా సమీపమైన రిపోర్టును విడుదల చేసింది. 

Also Read: Ayodhya: రాజీవ్ గాంధీ హయాంలోనే రామ మందిరానికి శంకుస్థాపన: శరద్ పవార్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ 10 దేశాల జాబితా:

1. యునైటెడ్ స్టేట్స్
2. రష్యా
3. చైనా
4. ఇండియా
5. సౌత్ కొరియా
6. యునైటెడ్ కింగ్‌డం
7. జపాన్
8. తుర్కియే
9. పాకిస్తాన్
10. ఇటలీ

ఇక మిలిటరీ శక్తి బలహీనంగా ఉన్న పది దేశాలు ఇలా ఉన్నాయి

1. భూటాన్
2. మాల్డోవా
3. సూరినామ్
4. సోమాలియా
5. బెనిన్
6. లైబీరియా
7. బెలీజ్
8. సియెర్రా లియోన్
9. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
10. ఐస్‌లాండ్

click me!