యుక్తవయస్సు ప్రమాదకరం,18 ఏళ్లలోపు విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం సరికాదు: హైకోర్టు కు కేరళ వర్సిటీ వివరణ 

By Rajesh KarampooriFirst Published Dec 21, 2022, 5:44 AM IST
Highlights

కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థినులు రాత్రి 9.30 గంటల తర్వాత హాస్టల్ లోపలికి మరియు బయటికి వెళ్లడాన్ని నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడపడం సరికాదని పిటిషన్‌పై విచారణ సందర్భంగా యూనివర్సిటీ వాదించింది.నిబంధనలు లేకుండా హాస్టల్ గేట్లు తెరవడం శాస్త్రీయ అధ్యయనం లేకుండా చేస్తే సమాజానికి హానికరం అని అఫిడవిట్ పేర్కొంది

కొన్ని కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులే.. కాదు అభ్యర్థుల వాదనలు కూడా చాలా ఆలోచింపజేస్తాయి. ప్రధానంగా మహిళ స్వేచ్ఛ విషయంలో వాదనలు చర్చనీయాంశంగా మారతాయి. అలాంటి వాదననే కేరళ హైకోర్టులో చోటుచేసుకుంది. అబ్చాయిలతో పాటు అమ్మాయిలకూ రాత్రి పూట స్వేచ్ఛ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన కేరళ హై కోర్టు .. కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాదనను కూడా పరిగణనలోకి తీసుకుంది. 

ఇంతకీ ఏం జరిగింది..? 

కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థినులు..  అబ్చాయిలతో పాటు తాము కూడా రాత్రి పూట బయట తిరిగేలా స్వేచ్ఛ ఇవ్వాలని, రాత్రి 9.30 గంటల తర్వాత హాస్టల్ లోపలికి , బయటికి వెళ్లడాన్ని నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ నిషేధాన్ని సమర్థిస్తూ..  మంగళవారం నాడు హైకోర్టులో కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తన వాదనను వినిపించింది. విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడపడం సరికాదని పేర్కొంది. 18 ఏళ్లలోపు విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం సమాజానికి సరికాదని విశ్వవిద్యాలయం విజ్ఞప్తి చేసింది. 

కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KUHS) ప్రకారం.. 18 సంవత్సరాల వయస్సులో విద్యార్థులకు పూర్తి స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేయడం సమాజానికి మంచిది కాదని తెలిపింది. పిటిషన్‌ను పరిశీలిస్తున్న జస్టిస్ దేవన్ రామచంద్రన్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం గతంలో ఈ ఆదేశాలను తప్పుబట్టింది. కానీ.. తాజాగా విశ్వవిద్యాలయంతో సహా అన్ని అనుసంస్థల అభిప్రాయాలను కోరింది. ఈ క్రమంలో యూనివర్సిటీ తన అఫిడవిట్‌ దాఖాలు చేసింది.  

విశ్వవిద్యాలయం తన పిటిషన్ లో “ఎలాంటి నియంత్రణ లేకుండా హాస్టళ్ల గేట్‌లను తెరవడం సరైన శాస్త్రీయ అధ్యయనం లేకుండా చేస్తే అది సమాజానికి హానికరం. యౌవనస్థుల ప్రవర్తనపై నిర్వహించిన వివిధ అధ్యయనాలు..  రోడ్డు ప్రమాదాలు , మరణాల శాతం, మాదకద్రవ్యాలు , మత్తు పదార్ధాల వినియోగం, ఆత్మహత్యలు, నరహత్యల రేటు మొదలైనవి చాలా ఎక్కువగా ఉన్నాయని సూచిస్తున్నాయి. కౌమార వయస్సును నిర్వహించడం చాలా ప్రమాదకరమని, పిటిషనర్లు తమ ఇళ్ల వద్ద కూడా పొందలేని సంపూర్ణ స్వేచ్ఛను కోరుకోవడం సమర్థనీయం కాదని విశ్వవిద్యాలయం పేర్కొంది.

విశ్వవిద్యాలయం తన అఫిడవిట్‌లో ధృవీకరించడానికి వైద్యపరమైన అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకవచ్చింది. మెచ్యూరిటీ వయస్సు పిల్లలను మానసికంగా పరిపక్వంగా చేయదని పేర్కొంది. న్యూరో బిహేవియరల్, న్యూరో-మోర్ఫోలాజికల్, న్యూరోకెమికల్, న్యూరోఫిజియోలాజికల్, న్యూరోఫార్మాకోలాజికల్ ఆధారాలు కౌమారదశలో మెదడు చురుకుగా పరిపక్వత చెందుతుందని సూచిస్తున్నాయి. పర్యావరణ ఒత్తిళ్లు, ప్రమాదకర ప్రవర్తన, మాదకద్రవ్య వ్యసనం, అసురక్షిత సెక్స్‌కు కౌమార మెదడు నిర్మాణాత్మకంగా,క్రియాత్మకంగా హాని కలిగిస్తుందనే పరికల్పనకు ఇటువంటి ఆధారాలు మద్దతు ఇస్తున్నాయని తన పిటిషన్ లో పేర్కొంది. 

అదే సమయంలో.. డిసెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా విరామ సమయాన్ని చాలా వరకు సడలించామని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిని వెంటనే అమలు చేయాలని జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఆదేశించారని ప్రభుత్వం తెలిపింది. కొత్త ఉత్తర్వు ప్రకారం రాత్రి 9.30 గంటలకే బాలబాలికల హాస్టల్ గేట్లను మూసివేసినా, కొన్ని షరతులతో విద్యార్థులకు ముందుగా మినహాయించి, నిర్ణీత సమయం తర్వాత కూడా లోపలికి వెళ్లేందుకు తగిన వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రాథమికంగా స్వాగతించదగ్గ చర్య అని కూడా హైకోర్టు పేర్కొంది. మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు తక్షణమే ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని జస్టిస్ రామచంద్రన్ ఆదేశించారు.

click me!