ఉత్తరాఖండ్‌లో గ్యాస్ లీక్.. 20 మందికి పైగా అస్వస్థత

By team teluguFirst Published Aug 30, 2022, 3:51 PM IST
Highlights

ఉత్తరాఖండ్‌లోని ఉధంసింగ్ నగర్ లో గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. ఈ విష వాయువును పీల్చడం వల్ల 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

ఉత్తరాఖండ్‌లోని ఉధంసింగ్ నగర్ జిల్లా కేంద్రం రుద్రాపూర్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యింది. దీంతో 20 మందికి పైగా అస్వ‌స్థ‌తకు గురై హాస్పిట‌ల్ లో చేరారు.

న్యూడ్ ఫోటో షూట్ కేసులో పోలీసు స్టేషన్‌కు రణ్‌వీర్ సింగ్.. దర్యాప్తులో ఏం చెప్పాడంటే?

రుద్రాపూర్‌లోని ఆజాద్ నగర్ ట్రాన్సిట్ క్యాంప్ ప్రాంతంలో గ్యాస్ లీక్ జ‌రుగుతోంద‌న్న స‌మాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. అనంత‌రం స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించింది.

కేర‌ళ‌లో దంచికొడుతున్న వాన‌లు.. నీట మునిగిన కొచ్చి.. ఐదు రోజుల పాటు వ‌ర్షాలు ప‌డే ఛాన్స్..

45-50 లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ సిలిండర్‌ల పైప్ క‌ట్ అవ్వ‌డంతో గ్యాస్‌ లీక్ జ‌రిగింద‌ని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలం సింగ్‌ బజేలీ తెలిపారు. లీకేజ్ అవుతున్న సిలిండర్‌ను అట‌వీ ప్రాంతానికి త‌ర‌లించామ‌ని, దీంతో ఎలాంటి అవంఛ‌నీయ ఘ‌ట‌న‌లూ జ‌ర‌కుండా చేశామ‌ని పేర్కొన్నారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం.. అన్ని విచారణలను రద్దు చేస్తూ...

ఈ ప్ర‌మాదం వ‌ల్ల 20 మందికి పైగా వ్య‌క్తులు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ్డారు. దీంతో వారంద‌రినీ వెంట‌నే హాస్పిట‌ల్ కు త‌ర‌లించి చికిత్స అందించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌లో లీక్ అయిన గ్యాస్ ఏర‌క‌మైన‌ది అనేది ఇంకా తెలియ‌రాలేదు. 

click me!