బాలికపై గ్యాంప్ రేప్.. తమలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని బాధితురాలిపై నిందితుల ఒత్తిడి.. భరించలేక ఆత్మహత్యాయత్నం.

By team teluguFirst Published Nov 23, 2022, 1:08 PM IST
Highlights

ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులు జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం బాధితురాలి దగ్గరికి వెళ్లి తమలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని బెదిరించారు. దీంతో ఆమె ఆత్మహత్యకుయత్నించింది. 

16 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన నిందితులు తమలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ వేధింపులు తాళలేక ఆమె శరీరానికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

ఫోర్న్ వీడియోలు చూడడానికి అలవాటు పడి.. అమ్మాయిల బాత్రూంలో దూరి.. వీడియోలు తీసి...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖాబాద్ జిల్లాలోని ఫతేఘర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని ఓ గ్రామంలో 2021  జనవరి 8వ తేదీన మైనర్ బాలికను పొలంలో పని చేసి ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు వెనుక నుంచి వచ్చి ఆమెను అపహరించి, దూషిస్తూ ఏకాంత ప్రదేశానికి ఈడ్చుకెళ్లారు. బాలిక ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అయితే వారిద్దరికీ ఈ ఏడాది ఆగస్టులో బెయిల్ లభించింది. అయితే ఆమెపై నిందితులు కొన్ని కాలం నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని, కేసు ఉపసంహరించుకోవాని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నివారాల కిందట బజారులో ఉండగా బాలికను అడ్డుకున్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. 

ఆడిడాస్ తమ్ముడు అజిత్ డాస్... మహేంద్ర ట్వీట్ వైరల్..!

ఈ వేధింపులు భరించలేక బాధితురాలు నవంబర్ 7వ తేదీన శరీరానికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బాలికను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె అక్కడ 70 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతోంది. దీనిపై బాధితురాలి తండ్రి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ‘‘ ఇద్దరు వ్యక్తులు నా కూతురి జీవితాన్ని నరకప్రాయంగా మార్చారు.. ఫోన్‌లో మెసేజ్‌లు పెట్టి మానసికంగా వేధింపులకు గురి చేశారు. వారు చెప్పినట్టు చేయకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చినా పోలీసులు అక్కడికి చేరుకోలేదు.’’అని ఆయన తెలిపారు. 

వాళ్లు బాలకార్మికుల కిందికి వస్తారు.. రవీంద్ర జడేజా మాజీ భార్యపై సోదరి ఫైర్..

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ మీనా పరిశీలించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూసుకోవాలని డాక్టర్లకు సూచించారు. బాలిక, ఆమె కుటుంబ సభ్యుల భద్రత కోసం సబ్-ఇన్‌స్పెక్టర్ దీపేంద్ర కుమార్ ఆధ్వర్యంలో సిబ్బందిని మోహరించారు. ఈ ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. నిందితులపై కఠినమైన ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. కాగా.. బాలిక ఆత్మహత్యాయత్నానికి కారణమైన నిందితులు ఇద్దరూ సోదరులు అని ఎస్ హెచ్ వో సచిన్ కుమార్ సింగ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు. వారిపై తాజాగా సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపించామని చెప్పారు. 


 

click me!