పుట్టినరోజు నాడు నాలుగు కీలక ప్రసంగాలు చేయనున్న ప్రధాని మోడీ.. వివరాలివే

By Siva KodatiFirst Published Sep 16, 2022, 6:21 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

రేపు సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన రేపు వన్యప్రాణులు, పర్యావరణం, మహిళా సాధికారత, నైపుణ్యాలు , యువతరం అభివృద్ధి, నెక్ట్స్‌ జనరేషన్ ఇన్‌ఫ్రా వంటి విభిన్న రంగాలను కవర్ చేసే నాలుగు ముఖ్యమైన ప్రసంగాలను చేయనున్నారు. చిరుతలు భారత్‌కు వచ్చిన చారిత్రక సందర్భంగా ఆయన జాతిని ప్రసంగిస్తారు. అనంతరం ఎంపీపీలో మహిళా స్వయం సహాయక సంఘాల సదస్సులో మోడీ ప్రసంగిస్తారు. అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐటీఐ విద్యార్ధుల దీక్షాంత సమరోత్‌లో 40 లక్షల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు సాయంత్రం నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించి ప్రసంగిస్తారు. 

ఇకపోతే.. తమిళనాడు బీజేపీ యూనిట్ రేపు ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని బంగారు ఉంగరాలను పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ యూనిట్ తెలిపింది. ఉంగరాలను పంపిణీ చేయడానికి ఆర్ఎస్ఆర్ఎం హాస్పిటల్‌ను ఎంచుకున్నట్టు బీజేపీ రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్‌కు తెలిపారు. ప్రతి బంగారు ఉంగరం రెండు గ్రాముల బరువు ఉండనుంది. ఈ ఉంగరాలను రేపు పుట్టిన శిశువులకు పంపిణీ చేస్తున్నారు. ఇది పార్టీ కోసం చేసే ఉచితాల స్కీం కాదని తెలిపారు. కానీ, శిశువులను స్వాగతించాలని పార్టీ భావిస్తున్నదని, అందుకే ఈ స్కీంను చేపడుతున్నట్టు వివరించారు. 

ALso REad:మోడీ పుట్టిన రోజు సందర్భంగా రేపు బంగారు ఉంగరాల పంపిణీ.. ఎక్కడో.. ఎవరికో తెలుసా?

అంతేకాదు, ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా 730 కిలోల చేపలను పంపిణీ చేయనున్నట్టూ తెలిపారు. ఈ ఏడాది పుట్టిన రోజుతో ప్రధాని మోడీ 73వ పడిలోకి వెళ్లుతారు. ఈ సందర్భంగా 720 కిలోల చేపలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. చేపల వినిమయాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వారు వివరించారు.

click me!