ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు.. నైజీరియా మహిళకు పాజిటివ్.. దేశంలో మొత్తం కేసులు 13

By Mahesh KFirst Published Sep 16, 2022, 6:02 PM IST
Highlights

మరో మంకీపాక్స్ కేసు ఢిల్లీలో నమోదైంది. నైజీరియాకు చెందిన 30 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ టెస్టు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసులు ఎనిమిదికి చేరాయి.
 

న్యూఢిల్లీ: దేశంలో మరో మంకీపాక్స్ కేసు రిపోర్ట్ అయింది. నైజీరియాకు చెందిన ఓ మహిళకు టెస్టు చేయగా ఆమెకు మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 8కు చేరింది. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13కు పెరిగింది.

30 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్ అని తేలినట్టు అధికారులు తెలిపారు. ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ హాస్పిటల్ ఎల్‌ఎన్‌జేపీలో అడ్మిట్ అయ్యారని విశ్వసనీయ వర్గాలు వివరించాయి. మరో అనుమానిత పేషెంట్ కూడా ఈ హాస్పిటల్‌లో చేరారు.

ఢిల్లీలో కొత్తగా ఓ నైజీరియా మహిళలో మంకీపాక్స్ ఉన్నట్టు గుర్తించామని ఆ వర్గాలు తెలిపాయి. 30 ఏళ్ల వయసు ఉన్న నైజీరియా మహిళ తాజాగా ఈ జాబితాలో చేరింది. ఆమె ప్రస్తుతం ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఆ వర్గాలు చెప్పాయి.

మంకీపాక్స్ ఉన్నట్టుగా అనుమానిస్తున్న మహిళ కూడా నైజీరియాకు చెందిన వ్యక్తే. ఆమె సెప్టెంబర్ 14న ఇదే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఢిల్లీలో నమోదైన మొత్తం 8 కేసుల్లో ముగ్గురు పురుషులు ఉన్నారు. 

ఇంతకు ముందు రిపోర్ట్ అయిన ఆరు కేసులు నయం అయ్యాయని సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.

click me!