మాజీమంత్రి విజయ‌భాస్కర్ ఆస్తుల కేసు: 43 చోట్ల డీవీఏసీ సోదాలు

By narsimha lodeFirst Published Oct 18, 2021, 9:22 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలోని మాజీ మంత్రి సి. విజయభాస్కర్ ఇంటిపై డీవీఏసీ అధికారుల సోదాలు చేశారు.ఆరు జిల్లాల్లోని 43 చోట్ల  అధికారులు సోదాలు నిర్వహించారు.. ఇప్పటికే ముగ్గురు మంత్రులపై దాడులు జరిగాయి.
 

చెన్నై: మాజీ మంత్రి డాక్టర్ సి. విజయ భాస్కర్ నివాసంపై సోమవారం నాడు  డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్,అవినీతి నిరోధక శాఖ అధికారులు  సోదాలు నిర్వహించారు. అక్రమాస్తుల కేసుల్లో అధికారులు సోదాలు చేశారు.

also read:కలిసుంటేనే అధికారం.. లేదంటే ప్రత్యర్ధులకే బలం: ఈపీఎస్, ఓపీఎస్‌లను ఉద్దేశిస్తూ శశికళ వ్యాఖ్యలు

తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  అన్నాడిఎంకెకు చెందిన  మంత్రుల ఇళ్లలో DVAC అధికారులు సోదాలు చేస్తున్నారు. అన్నాడిఎంకె ప్రభుత్వంలో  పనిచేసిన ముగ్గురు మంత్రులపై ఇళ్లపై ఇప్పటికే సోదాలు జరిగాయి. విజయ్‌భాస్కర్ నాలుగోవాడు.

అంతకుముందు మాజీ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కేసీ వీరమణి,. మాజీ రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్, మాజీ లోకల్ అడ్మినేష్ట్రన్ మంత్రి ఎస్పీ వేలుమణి ఇళ్లపై సోదాలు జరిగాయి. అయితే ఈ సోదాలను రాజకీయ ప్రేరేపితమైనవిగా అన్నాడిఎంకె ఆరోపించింది.

చెన్నైకి 350 కి.మీ దూరంలోని విరళిమలై అసెంబ్లీ నియోజకవర్గం నుండి డాక్టర్ విజయ భాస్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, పుదుక్కొట్టాయ్‌లోని ఆరు జిల్లాల్లోని 43 చోట్ల సోదాలు జరుగుతున్నాయని దర్యాప్తు సంస్థ ప్రతినిధి ప్రకటించారు.

మాజీ మంత్రి రూ. 27 కోట్ల కూడబెట్టారని ఎప్ఐఆర్ లో దర్యాప్తు సంస్థ తెలిపింది. 2013, 2021లలో ఆరోగ్య మంత్రిగా ఆయన పనిచేశారు. విజయభాస్కర్ రూ. 6.4 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారని ఎప్ఐఆర్ నివేదిక తెలుపుతుంది.

2016, 2021 ఎన్నికల  సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో డీవీఎస్ మాజీమంత్రి ఆస్తుల వివరాలను పొందింది. దీని ఆధారంగా వారు దాడులు చేశారు.విజయభాస్కర్  రూ.27 కోట్ల ఆస్తులను ఎక్కువగా కలిగి ఉన్నారని ఎప్ఐఆర్‌లో డీవీఏసీ పేర్కొంది.

మాజీ మంత్రి విజయభాస్కర్ పై అరప్పోర్ ఇయక్కం అనే స్వచ్చంధ సంస్థ అవినీతి ఆరోపణలు చేసింది. డాక్టర్ విజయభాస్కర్ ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ముందు 2017లో ఐటీ అధికారులు దాడులు చేశారు.


 

click me!