పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి కేంద్రం కసరత్తు.. ఆర్థిక శాఖతో సంప్రదింపులు?

By telugu teamFirst Published Oct 18, 2021, 8:01 PM IST
Highlights

దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలపై దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే వీటి ధరలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కొన్నివర్గాలు వివరించాయి. అధిక పన్నులను అంగీకరించని పెట్రోలియం శాఖ ఆర్థిక శాఖతో సంప్రదింపులు చేసినట్టు తెలిసింది.
 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా Petrol, Diesel ధరలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ Rates సెంచరీ దాటాయి. డీజిల్ కూడా సెంచరీని సమీపిస్తున్నది. దీంతో సాధారణ పౌరులు సహా ప్రతిపక్షాలన్నీ Fuel ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ కేంద్రంలోని బీజేపీ చమురు ధరల సవాల్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

పెట్రోలియం ధరలు తగ్గించడానికి ఆర్థిక శాఖతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు చేస్తున్నదని ఆ వర్గాలు తెలిపాయి. చమురు ధరలు తగ్గించాలని పెట్రోలియం శాఖ భావిస్తున్నదని, ఇందుకోసమే తదుపరి కార్యచరణ ఎలా ఉండాలనే అంశంపై ఆర్థిక శాఖతో చర్చించినట్టు వివరించాయి. చమురు ధరలపై విధిస్తున్న అధిక పన్నులపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నదని తెలిపాయి. Taxపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ప్రజలకు కొంత ఉపశమనిచ్చే అవకాశముందని వివరించాయి. అయితే, ఎల్పీజీ పరిస్థితి వేరుగా ఉన్నది. ఎల్పీజీ సబ్సిడీనీ కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కేవలం అవసరార్థులకే ఎల్పీజీ సబ్సిడీ అందించాలని భావిస్తున్నట్టు సమాచారం.

అయితే, చమురు ధరలు తగ్గించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటే సరిపోదని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. చమురు ధరలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలతోనూ చర్చల్లోకి వెళ్లినట్టు తెలిసింది. సౌదీ అరేబియా మొదలు రష్యా వరకు చమురు కంపెనీలతో చర్చించి ధరలు తగ్గించే అవకాశాలను పరిశీలించినట్టు సమాచారం. వచ్చే మూడు నెలల వరకు బ్యారెల్ చమురు ధర 70 అమెరికన్ డాలర్లు ఉండాలని, అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని ఓ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. 

Also Read: జెట్ ప్లేన్స్ ఇంధన ధరలను మించిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకి ఎంతంటే ?

ఇవే వర్గాలు మరో విషయంపైనా స్పష్టతనిచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే అంశంపై ఏకాభిప్రాయం లేదని తెలిపాయి. అలాగే, దేశ వ్యూహాత్మక చమురు నిల్వలు 90 రోజుల కన్నా తక్కువగా ఉన్నాయని, కేవలం అత్యవసర పరిస్థితులకు మాత్రమే సరిపోతాయని వివరించాయి.

చమురు ధరలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా కూడా కేంద్రాన్ని విమర్శించారు. మనదేశం జీవచ్ఛవాలతో నిండిన దేశమని ట్వీట్ చేశారు. చమురు ధరలు రోజూ ఇలా అన్యాయంగా, అక్రమంగా పెంచుకుంటూ పోతే ప్రపంచంలో ఎక్కడా దీన్ని స్వీకరించేవారు కాదని పేర్కొన్నారు. 2014లో కేంద్రం పన్ను రూపకంగా రూ. 75వేల కోట్లు వసూలు చేస్తే నేడు అది రూ. 3.50 లక్షల కోట్లకు పెరిగిందని, ఇది పట్టపగలు దోపిడీ కాదా? అని ప్రశ్నించారు.

click me!