మర్డర్ కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు.. మరో నలుగురికీ శిక్ష

Published : Oct 18, 2021, 05:10 PM IST
మర్డర్ కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు.. మరో నలుగురికీ శిక్ష

సారాంశం

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ తన అనుచరుడు, సచ్చా సౌదా మేనేజర్‌గా వ్యవహరించిన రంజిత్ సింగ్ హత్య కేసులో దోషిగా తేలాడు. ఆయనతోపాటు మరో నలుగురికి పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. దీంతోపాటు డేరా బాబాకు రూ. 31 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.   

చండీగడ్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా మరో కేసులో దోషిగా తేలారు. తన అనుచరుడు, డేరా సచ్చా సౌదా మేనేజర్‌గా వ్యవహరించిన రంజిత్ సింగ్ murder కేసులోనూ Dera Baba guilty అని కోర్టు పేర్కొంది. ఇప్పటికే ఆయన లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలి జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8న రంజిత్ సింగ్ హత్య కేసులో పంజకులలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులగా నిర్ధారించింది. శిక్ష ప్రకటనను వాయిదా వేసింది. తాజాగా డేరా బాబాతోపాటు మిగితా నలుగురు దోషులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

డేరా బాబాతోపాటు క్రిషన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్దిల్‌లకూ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శిక్షతోపాటు రామ్ రహీమ్ రూ. 31 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కాగా, సబ్దిల్ రూ. 1.5 లక్షలు, క్రిషన్, జస్బీర్‌లు రూ. 1.25 లక్షలు, అవతార్ రూ. 75వేల చెల్లించాలని ఆర్డర్ చేసింది. ఇందులో 50శాతం డబ్బు రంజిత్ సింగ్ కుటుంబానికి చేరనుంది. ఈ కేసులో ఆరో నిందితుడూ ఉన్నాడు. కానీ, ఏడాది క్రితమే ఆయన మరణించాడు.

డేరా సచ్చా సౌదాలో మహిళలపై, మహిళా అనుచరులపై డేరా బాబా లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నాడని ఓ అనామక లేఖను డేరా మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ ప్రచారం చేస్తున్నారని డేరా బాబా అనుమానించారు. కొన్నాళ్లు గమనించారు. అదే లేఖను హైలైట్ చేస్తూ సిర్సాకు చెందిన జర్నలిస్టు రామ చందర్ ఛత్రపతి సంచలన కథనం రాశారు. దీంతో భక్తి ముసుగులో డేరా బాబా చేస్తున్న అరాచకాలు, అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం, ఆ జర్నలిస్టు రామ చందర్ ఛత్రపతి కూడా హత్యకు గురయ్యారు. ఈ మర్డర్ కేసులోనూ డేరా బాబా దోషిగా ఉండటం గమనార్హం.

Also Read: డేరా బాబా బర్త్‌డే: పోస్టాఫీస్‌లో భక్తుల కోలాహలం

రంజిత్ సింగ్ 2002 జూలై 10న హత్యకు గురయ్యారు. haryana కురుక్షేత్రలోని థానేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఆయన హత్య జరిగింది. ఆ పోలీసు స్టేషన్‌లో మర్డర్, కుట్ర అభియోగాల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 2003 నవంబర్ 10న ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం డేరా బాబాను guiltyగా తేల్చింది.

PREV
click me!

Recommended Stories

భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport
కేరళను ముంచెత్తిన వరదలు రోడ్లపై పడవలు | Kerala Floods 2026 Boats on Roads After Heavy Rains