తమిళనాడు బాణసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం: ఐదుగురు సజీవ దహనం

Published : Oct 26, 2021, 09:35 PM ISTUpdated : Oct 26, 2021, 10:03 PM IST
తమిళనాడు బాణసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం: ఐదుగురు సజీవ దహనం

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని శంకరాపురంలోని బాణసంచా కేంద్రంలో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు.

చెన్నై:Tamilnadu రాష్ట్రంలోని Shankarapuram బాణసంచా కేంద్రంలో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించారు. మంటల్లో మరో 10 కార్మికులు చిక్కుకొన్నారని సమాచారం.

also read:పటాకుల తయారీ కంపెనీలో ప్రమాదం, చిన్నారితో సహా ముగ్గురు మృతి...

అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటల్లో చిక్కుకొన్న 10మందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఐదుగురు సజీవ దహనం కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరోవైపు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నవారి కుటుంబసభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఫ్యాక్టరీ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో శివకాశీలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.firecracker factoryలో భారీ ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకోవడం  సర్వసాధారణంగా మారింది. టపాకాయలు తయారు చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.

ఈ ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నస్టాలు చోటుచేసుకొంటున్నాయి. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. దేశంలోని తమిళనాడు సహా టపాకాయల తయారీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగాయి.


 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం