షాకింగ్.. జలాంతర్గామి సమాచారం లీక్.. నేవీ అధికారులను అరెస్ట్ చేసిన సీబీఐ..

By team teluguFirst Published Oct 26, 2021, 5:16 PM IST
Highlights

దేశ భద్రతకు సంబంధించి ఇదోక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. దేశ భద్రతకు సంబంధించి రహస్య సమాచారం లీకేజీ‌కు సంబంధించి ఇద్దరు రిటైర్డ్ నేవీ అధికారులతో పాటు, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఓ నేవీ అధికారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) అరెస్ట్ చేసింది.

దేశ భద్రతకు సంబంధించి ఇదోక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. దేశ భద్రతకు సంబంధించి రహస్య సమాచారం లీకేజీ‌కు సంబంధించి ఇద్దరు రిటైర్డ్ నేవీ అధికారులతో పాటు, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఓ నేవీ అధికారిని (Navy officer) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) అరెస్ట్ చేసింది. కిలో తరగతికి చెందిన ఓ జలాంతర్గామి ఆధునీకరణకు సంబంధించిన సమాచారాన్ని వీరు లీక్‌ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెలలో చోటుచేసుకున్న పరిణామాలు, సమాచారం లీకేజీపై విచారణ జరిపేందుకు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు భారత నావికాదళం వైస్ అడ్మిరల్, రియర్ అడ్మిరల్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి. 

అరెస్టయిన అధికారి తన అధికారిక హోదాలో యాక్సెస్ చేసిన తేదీని, హార్డ్‌వేర్‌ను.. అది బయటివారికి లీక్ అయ్యే అవకాశాలను కూడా సెంట్రల్ ఏజెన్సీ తనిఖీ చేస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఇక, అరెస్ట్ అయిన అధికారితో టచ్‌లో ఉన్న పలువురు అధికారులను కూడా సీబీఐ విచారిస్తున్నట్టుగా వెల్లడించాయి. 

Also read: దారుణమైన ట్రోలింగ్.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

‘సంబంధిత ఏజెన్సీల నుంచి ఇన్‌పుట్‌లు పొందిన తరువాత..kilo-class submarine ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనధికార సమాచారాన్ని రిటైర్డ్ అధికారులకు అందించినందుకు ప్రస్తుతం ముంబైలో పోస్ట్ చేయబడిన కమాండర్ (ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ సమానమైన) హోదాలో పనిచేస్తున్న నేవీ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది’ అని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి జాతీయ భద్రత ఏజెన్సీలతో సహా ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. 

Also read: రాచరికాన్ని వదిలి.. సామాన్యుడిని పెళ్లాడిన యువరాణి.. ఎట్టకేలకు ప్రేమించిన వాడితో..

సెంట్రల్ ఏజెన్సీ ద్వారా కొనసాగుతున్న దర్యాప్తులో భారత నావికాదళం సాయం అందజేస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు అధికారులు తమ సిబ్బందిని ప్రశ్నించేందుకు అనుమతిస్తామని కూడా పేర్కొంది. ఇక, పాకిస్థాన్ ఏజెన్సీలకు సమాచారాన్ని లీక్ చేయడంలో కొందరు రక్షణ సిబ్బంది రాజీపడినట్లు ఇటీవలి కాలంలో కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.

click me!