సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకిన కార్మికులు... ఇద్దరు దుర్మరణం

Published : Oct 18, 2021, 12:31 PM IST
సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకిన కార్మికులు... ఇద్దరు దుర్మరణం

సారాంశం

గుజరాత్‌లో సూరత్‌లోని ఓ ప్యాకేజింగ్ కంపెనీ యూనిట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మరణించారు. కనీసం 100 మందిని ఫైర్ సిబ్బంది కాపాడారు. మంటల నుంచి తప్పించుకోవడానికి ఐదంతస్తుల ఆ భవనంపై నుంచీ కార్మికులు దూకారు.

అహ్మదాబాద్: Gujaratలోని Suratలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. కడోదర ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్యాకేజింగ్ యూనిట్‌లో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో fire accident జరిగినట్టు అధికారులు తెలిపారు. ముందు ఫస్ట్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్టు సమాచారం. అనంతరం వేగంగా ఐదంతుస్థుల వరకు మంటలు వ్యాపించాయి. అగ్ని కీలల నుంచి తప్పించుకోవడానికి కార్మికులు కొందరు ఐదంతస్తుల పై నుంచి దూకేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారు.

Also Read: తైవాన్‌లో విషాదం: 13 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం, 46 మంది సజీవ దహనం

కడోదర ఇండస్ట్రియల్ ఏరియాలో వివా ప్యాకేజింగ్ కంపెనీ ఉన్నది. ఈ ఐదంతస్తుల భవనంలో వందకు మించి కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో కార్మికులంతా ఆందోళనతో పరుగులు తీశారు. ఇద్దరు కార్మికులు మంటలకు బలయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. హైడ్రాలిక్ క్రేన్‌ల ద్వారా వర్కర్‌లను రక్షించారు. సుమారు 100 మందికిపైగానే బాధితులను సహాయక సిబ్బంది రక్షించింది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. పది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తేవడానికి పనిచేశాయి.

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం