బిస్కెట్లు, చిప్సే ప్రాణం తీశాయా? 24 గంటల్లో ముగ్గురు అకాచెల్లెళు మృతి...!

By AN TeluguFirst Published Oct 18, 2021, 10:46 AM IST
Highlights

24 గంటల వ్యవధిలో ముగ్గురూ మృతి చెందారు. చిన్నారుల death వారి తల్లిదండ్రలతో పాటు.. గ్రామస్తులను కూడా కలిచి వేసింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలా మరణించారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అప్పటివరకు సరదాగా ఆడుతూ, పాడుతూ ఉన్న చిన్నారులు అకస్మాత్తుగా చనిపోవడం mysteriousగా మారింది. 

లక్నో : పారి, పిహు, విధి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. కలిసిమెలిసి ఉండేవారు. ఆడుతూపాడుతూ, అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా గడిపేవారు. జింకపిల్లల్లా చెంగు చెంగున పరుగుతు తీసే ఈ చిన్నారులు.. ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. 

24 గంటల వ్యవధిలో ముగ్గురూ మృతి చెందారు. చిన్నారుల death వారి తల్లిదండ్రలతో పాటు.. గ్రామస్తులను కూడా కలిచి వేసింది. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలా మరణించారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అప్పటివరకు సరదాగా ఆడుతూ, పాడుతూ ఉన్న చిన్నారులు అకస్మాత్తుగా చనిపోవడం mysteriousగా మారింది. ఈ చిన్నారులు ముగ్గురూ ఐదు నుంచి తొమిదేళ్ల వయసు వారే కావడం మరింత విషాదం. 

అయితే పోలీసులకు మొదట ఈ విషయాన్ని తెలియజేయకపోవడంతో ఆసల్యంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్, బరేలీకి చెందిన నవీన్ కుమార్ సింగ్ కు పారి, పిహు, విధి అని ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం వరకు కూడా ఈ ముగ్గురు sisters పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం ఈ అమ్మాయిలుBiscuits, chips కొనుక్కుని తిన్నారు. ఆ తరువాత ఉన్నట్లుండి ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. 

ఎడతెరిపి లేని వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. ఒకేసారి ముగ్గురికి ఇలా జరగడంతో తల్లిండ్రులు ఆందోళన పడ్డారు. చిన్నారుల తండ్రి నవీన్ కుమార్ వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే hospital కు వెళ్లేలోపే పారి, పిహు మరణించారు. చికిత్స పొందుతూ విధి మృతి చెందింది. 

వీరి మరణాలు అనుమానాస్పదంగా ఉన్నా తల్లిదండ్రులు పోలీసులకు తెలపలేదు. చిన్నారులకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతి గురించి పోలీసులకు తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంత్యక్రియలు ఆపేశారు. చిన్నారుల dead bodyలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఇంటిముందు ముగ్గేస్తున్న నాన్నమ్మపైకి లారీ ఎక్కించి... కిరాతకంగా హతమార్చిన మనవడు

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వారి శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని అటాప్సీ పరీక్షలో వెల్లడయ్యింది. ప్రస్తుతం పోలీసులు చిన్నారుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు బాలికలు తిన్న బిస్కెట్లు, చిప్స్ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. 

చిన్నారుల తండ్రి నవీన్ కుమార్ కథనం మేరకు.. దసరా పండుగ సందర్భంగా భోపాల్ నుండి గతవారమే తన సొంతూరైన రాయ బరేలీకి వచ్చామని తెలిపాడు. శుక్రవారం దసరా నాడు తన కూతుర్లు బిస్కెట్లు, చిప్స్ తిన్నారని తెలిపాడు. అర్థరాత్రివరకు పిల్లలు కడుపునొప్పి అంని మెలికలు తిరిగారని, ఆ తరువాత వాంతులు, విరేచనాలు,  అవుతుండడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మరణించారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

click me!