దారుణం : చెరుకురసం తాగుదామని తీసుకెళ్లి.. యువకుడిపై వ్యక్తి అత్యాచారం.. !

Published : Oct 18, 2021, 11:13 AM IST
దారుణం : చెరుకురసం తాగుదామని తీసుకెళ్లి.. యువకుడిపై వ్యక్తి అత్యాచారం.. !

సారాంశం

దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పద్ధతికి చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్రం సరదాగా వాకింగ్ కి వెళ్ళాడు.  స్థానిక రైల్వే ట్రాక్ వద్ద అదే గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి తారసపడ్డాడు.  చెరుకు రసం తాగుదాం రమ్మంటూ యువకుడిని నమ్మించి సమీపంలోని  పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

కర్నాటక : అత్యాచార ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి.  కామాంధులు కన్నుమిన్ను కానకుండా,  చిన్నా, పెద్దా చూడకుండా  అఘాయిత్యాలకు  పాల్పడుతున్నారు. ఎన్ని  కఠిన శిక్షలు అమలు చేస్తున్నా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. బాలికలు, మహిళలు, వృద్ధులను కూడా వదిలిపెట్టడం లేదు. 

అత్యాచారం, లైంగిక వేధింపులు అనగానే మహిళల మీదనే జరుగుతాయని విశ్వాసం ఉంది. అయితే ఇటీవలి కాలంలో పురుషుల మీద ముఖ్యంగా యువత, బాలుర మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పురుషుడిని పురుషులే గ్యాంగ్ రేప్ చేయడం, ఎత్తుకెళ్లి rape చేసి బెదిరించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

ఈ వికృతానికి కారణాలేవైనా.. ఆడపిల్లలే కాదు మగవాళ్లకూ భద్రత కరువవుతోందని వారూ Rape, sexual harassment కు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళనలో పడుతున్నారు. అలాంటి ఘటనలే కర్నాటకలో చోటు చేసుకుంటున్నాయి. కామాంధులకు ఆడా, మగా, హిజ్రాలు అనే తేడాలు ఉండవనడానికి ఇటీవల కర్ణాటక లో జరిగిన దారుణాలే ఉదాహరణలు.  ఓ యువకుడు సాయంత్రం వాకింగ్ కి పెడితే .. కామాంధులు అతనిపై కన్నేశారు.  అలాగే మరో ఘటనలో యువకుడిపై molestation జరిగింది.  వివరాల్లోకి వెళితే…

వాకింగ్ కు వెడితే..

దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పద్ధతికి చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్రం సరదాగా వాకింగ్ కి వెళ్ళాడు.  స్థానిక రైల్వే ట్రాక్ వద్ద అదే గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి తారసపడ్డాడు.  చెరుకు రసం తాగుదాం రమ్మంటూ యువకుడిని నమ్మించి సమీపంలోని  పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

బిస్కెట్లు, చిప్సే ప్రాణం తీశాయా? 24 గంటల్లో ముగ్గురు అకాచెల్లెళు మృతి...!

విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి వచ్చిన అతడు భయపడుతూ ఉండడం, విచిత్రంగా ప్రవర్తించడాన్ని గమనించిన తండ్రి ఏం జరిగిందని ప్రశ్నించాడు. మొదట విషయం చెప్పడానికి భయపడ్డాడు. తండ్రి ధైర్యం చెప్పడంతో తన మీద జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో ముందు షాక్ అయిన తండ్రి.. ఆ తరువాత తేరుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో accused హనీఫ్ ను అరెస్టు చేశారు.

బస్సు కోసం ఎదురు చూస్తుంటే...

అదే విధంగా మరో ఘటనలో బెల్గాం జిల్లా కు చెందిన 24 ఏళ్ల యువకుడు పై sexual assault జరిగింది.  అంతాని అనే పట్టణానికి చెందిన వ్యక్తి హోటల్లో హెల్పర్ గా పనిచేస్తుంటాడు. ఈ నెల 5వ తేదీన పని ముగించుకుని బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు.  అదే సమయంలో గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి  యువకుణ్ని బైక్ మీద తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport
కేరళను ముంచెత్తిన వరదలు రోడ్లపై పడవలు | Kerala Floods 2026 Boats on Roads After Heavy Rains