సెల్ ఫోన్ ఛార్జర్ స్విచ్చ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన తండ్రి.. పిన్ను నోట్లో పెట్టుకొని 8 నెలల చిన్నారి మృతి

Published : Aug 03, 2023, 06:48 AM IST
సెల్ ఫోన్ ఛార్జర్ స్విచ్చ్ ఆఫ్ చేయడం మర్చిపోయిన తండ్రి.. పిన్ను నోట్లో పెట్టుకొని 8 నెలల చిన్నారి మృతి

సారాంశం

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. ఎనిమిది నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఛార్జర్ పిన్ ను నోట్లో పెట్టుకుంది. ఆ సమయంలో స్విచ్ఛ్ ఆఫ్ లేకపోవడంతో ఆ పసి పాపకు షాక్ తగిలింది. దీంతో బాలిక మరణించింది.

మొబైల్ ఛార్జర్ నోట్లో పెట్టుకుని ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో 8 నెలల చిన్నారి మరణించింది. ఈ ఘటన కర్ణాటకలోని కార్వార్ తాలూకాలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. కార్వార్ ప్రాంతంలో సంతోష్ హెస్కామ్ (హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ)లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

దారుణం.. బాలికపై పలుమార్లు మేనబావ, అతడి స్నేహితులు అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరు..

ఆయనకు భార్య సంజన, ఎనిమిది నెలల కూతురు సానిధ్య ఉంది. అయితే ఎప్పటిలాగే ఆయన మంగళవాంర కూడా విధులకు వెళ్లే ముందు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టారు. అనంతరం ఛార్జింగ్ తీసి విధులకు వెళ్లారు. కానీ స్విచ్చ్ ఆఫ్ చేయడం చేయడం మర్చిపోయారు. అదే సమయంలో ఇంట్లో కూతురు ఆడుకుంటోంది. ఛార్జర్ వైర్ కిందికి వేలాడుతూ ఉండటంతో ఆ పసి పాప..దానిని నోట్లో పెట్టుకుంది. 

మృత్యుంజయుడు.. థానే ప్రమాదంలో 115 అడుగుల ఎత్తులో నుంచి పడినా.. గాయాలతో బయటపడ్డ కార్మికుడు

దీంతో వెంటనే ఆ చిన్నారికి కరెంట్ షాక్ కొట్టడంతో అపస్మార స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సానిధ్యను బైక్ పై సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆ బాలిక మరణించింది. హాస్పిటల్ కు చేరుకున్న వెంటనే చిన్నారి మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. దీంతో తమ ముద్దుల కుమార్తెను కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. 

శాంతియుతంగా ఉండండి.. అందరికీ రక్షణ కల్పించడం అసాధ్యం: హర్యానా సీఎం సంచలన వ్యాఖ్యలు

8 ఎనిమిది నెలల చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ ఉపకరణాల విషయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల ఆవశ్యకతను ఈ హృదయ విదారక ఘటన గుర్తుచేస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !