
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చుట్టూ చర్చ జరుగుతున్నది. మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఆందోళన బుధవారం కూడా జరిగింది. ఈ ఆందోళనల కారణంగా లోక్ సభ కనీసం 20 నిమిషాలైనా సేపైనా సజావుగా సాగలేకపోయింది. ఆందోళనలతో కలత చెందిన స్పీకర్ ఓం బిర్లా బుధవారం పార్లమెంటుకు రాలేదు. లోక్ సభలో సభ్యులు సభా గౌరవం కాపాడే వరకు తాను స్పీకర్ కుర్చీలో కూర్చోబోనని చెప్పినట్టు కొన్ని అధికారిక వర్గాలు చెప్పాయి. పరిస్థితి చక్కబడితేనే తాను స్పీకర్‌గా ఆ చైర్‌లో కూర్చుంటానని చెప్పినట్టు వివరించాయి.
పార్లమెంటు సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సభ ప్రతిష్టను కాపాడాలనే స్పీకర్ ప్రయత్నిస్తుంటాడని ఓం బిర్లా పేర్కొన్నట్టు ఆయన కార్యాలయ వర్గాలు వివరించాయి. అందుకే ఆయన ఈ రోజు లోక్ సభకు రాలేదని తెలుస్తున్నది. పార్లమెంటు సభ్యుల తీరు మెరుగై, సభా మర్యాదలను పాటించే రోజునే లోక్‌సభకు వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటానని ఓం బిర్లా చెప్పినట్టు ఆ వర్గాలు వివరించాయి.
Also Read: శాంతియుతంగా ఉండండి.. అందరికీ రక్షణ కల్పించడం అసాధ్యం: హర్యానా సీఎం సంచలన వ్యాఖ్యలు
బుధవారం ఆయన లోక్ సభకు రాకపోవడంతో ప్యానెల్ స్పీకర్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిలు ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించాల ని ప్లాన్ వేసుకున్నారు. కానీ, సభ ప్రారంభం కాగానే మణిపూర్ హింసపై మోడీ మాట్లాడాలనే డిమాండ్లు వినిపిపంచాయి. ఆందోళనలు జరిగాయి. కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలూ వెల్ లోకి దూసుకెళ్లాయి. దీంతో సభ స్టార్ట్ అయిన పావుగంటలోనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. కాగా, మరోసారి మధ్యాహ్నం రెండు గంటలకు సభ నడపాల ని ప్రయత్నించగా.. సాధ్యపడలేదు. కేవలం నాలుగు నిమిషాల్లోనే లోక్ సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. నేడు కూడా పార్లమెంటు వర్షా కాల స మావేశాలు కొనసాగుతున్నాయి.