విభేదాలా, డ్రామానా: హీరో విజయ్ ప్రకటనపై స్పందించిన తండ్రి చంద్రశేఖరన్

Published : Nov 06, 2020, 05:31 PM ISTUpdated : Nov 06, 2020, 05:32 PM IST
విభేదాలా, డ్రామానా: హీరో విజయ్ ప్రకటనపై స్పందించిన తండ్రి చంద్రశేఖరన్

సారాంశం

తన తండ్రి పెడుతున్న పార్టీ తన ఫొటోను గానీ, తన పేరును గానీ వాడుకోకూడదని హీరో విజయ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దానిపై విజయ్ తండ్రి చంద్రశేఖరన్ స్పందించారు.

చెన్నై: తమిళ హీరో విజయ్ తాను పార్టీ రిజిష్టర్ కు దరఖాస్తు చేసిన విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తండ్రి చంద్రశేఖరన్ స్పందించారు. తమ ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయనే మాటలో నిజం లేదని ఆయన చెప్పారు. మీడియా అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

విజయ్ చేసిన ప్రకటనపై ఆయననే ఆడగాలని, తనను కాదని చంద్రశేఖరన్ అన్నారు.అబిమాన సంఘం తరఫున జరిగే మంచి పనులకు అందీకారం లభించాలని తాను అనుకున్నట్లు ఆయన తెలిపారు. 

Also Read: లీగల్ గా చర్యలు.. తండ్రిని హెచ్చరిస్తూ విజయ్ ప్రకటన

తన తండ్రి రాజకీయ పార్టీ రిజిష్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకోవడంపై తనకు ఏ విధమైన సంబంధం లేదని హీరో విజయ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తన ఫొటో గానీ తన పేరు గానీ వాడుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దీనీపైనే తాజాగా చంద్రశేఖరన్ స్పందించారు. 

విజయ్ కు, ఆయన తండ్రి చంద్రశేఖరన్ కు మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. చంద్రశేఖరన్ తమ మధ్య విభేదాలు లేవని చెప్పినప్పటికీ దాన్ని పూర్తిగా నమ్మవచ్చునా అనేది మరో ప్రశ్న.

Also Read: పార్టీ పేరును రిజిష్టర్ చేయించిన హీరో విజయ్: ఏది నిజం?

కాగా, ప్రజల నాడిని పరీక్షించడానికి తండ్రీకొడుకులు కలిసి ఓ డ్రామాకు తెర తీశారా అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి. తమిళనాడు ఎన్నికలను సమీపిస్తున్న తరుణంలో ప్రజల నాడిని బట్టి రంగంలోకి దిగాలా, వద్దా అనే నిర్ణయానికి రావడానికి విజయ్ తన తండ్రి చంద్రశేఖరన్ తో కలిసి వివాదానికి తెర తీశారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళనాడులో ఈ సందేహమే బలంగా వ్యక్తమవుతోంది.
 

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు.. ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)