న్యూజిలాండ్ పార్లమెంట్‌లో మలయాళంలో రాధాకృష్ణన్ ప్రసంగం

By narsimha lodeFirst Published Nov 6, 2020, 3:29 PM IST
Highlights

న్యూజిలాండ్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన ప్రియాన్సా రాధాకృష్ణన్ పార్లమెంట్ లో తొలిసారిగా మళయాళం మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను సివిల్ ఏవియేషన్ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్విట్టర్ లో షేర్ చేశారు.


హైదరాబాద్: న్యూజిలాండ్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ పార్లమెంట్ లో తొలిసారిగా మళయాళం మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను సివిల్ ఏవియేషన్ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఇండియాలో ప్రియాంకా రాధాకృష్ణన్ ఇండియాలో పుట్టింది. ఆమె వయస్సు 41 ఏళ్లు. సింగపూర్ లో పాఠశాలకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె తదుపరి విద్య కోసం న్యూజిలాండ్ కు వెళ్లారు.

 

Doing India proud, the Indian origin minister in New Zealand addresses her country's parliament in Malayalam. pic.twitter.com/f3yUURW2Em

— Hardeep Singh Puri (@HardeepSPuri)

2017 సెప్టెంబర్ లో లేబర్ పార్టీ తరపున ఆమె పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. మూడేళ్ల తర్వాత ప్రధాని జకిందా ఆర్డెర్న్ ఐదుగురిని కొత్త మంత్రులుగా తీసుకొన్నారు. ఇందులో రాధాకృష్ణన్ కు చోటు దక్కింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన భారత సంతతికి చెందిన మంత్రిగా రికార్డు సృష్టించారు.

పార్లమెంట్ లో మాట్లాడే ముందు మళయాళంలో ఆమె ప్రసంగించారు. కేరళలో తన మూలాలను రాధాకృష్ణన్ ప్రస్తావించారు.ఈ వీడియో 2017 నవంబర్ పార్లమెంట్ సమావేశాల్లో చోటు చేసుకొంది.

న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన మంత్రి మళయాళంలో మాట్లాడారని  ఈ వీడియోను సివిల్ ఏవియేషన్ మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు.
రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో పుట్టారు. 

మళయాళీ దంపతులకు ఆమె జన్మించారు. ఆమె పుట్టిన రోజు సోమవారం. కమ్యూనిటీ, స్వచ్ఛంధ రంగానికి వాలంటీర్ సెక్టార్ కు ఆమె మంత్రిగా నియమితులయ్యారు. జాకిందా ఆర్డెర్న్ కొత్త ప్రభుత్వంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.

రాధాకృష్ణన్ కేరళ సీఎం పినరయి విజయన్ అభినందించారు. న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన మంత్రిగా రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉందని విజయన్ చెప్పారు.లేబర్ పార్టీకి నాయకురాలికి కేరళ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు.

click me!