
మహారాష్ట్రలోని లాతూర్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మోటర్‌బైక్‌ను టెంపో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ బైక్ పై ఆరుగురు వ్యక్తులు కూర్చొని రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు. ఈ బైక్ కలాంబ్ వైపు వెళ్తోంది. ఇదే సమయంలో ఎదురుగా ఓ టెంప్ వేగంగా వస్తోంది. అయితే ఎదురుగా, రాంగ్ రూట్ లో వస్తున్న బైక్ ను టెంపో గమనించకపోవడంతో దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం విచారకరం.
మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ప్రధానికి 8 విపక్ష పార్టీల లేఖ.. కాంగ్రెస్ ఎందుకు దూరంగా ఉన్నది?
ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే గేట్‌గావ్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాలను లాతూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని సబ్ ఇన్‌స్పెక్టర్ నందకిషోర్ కాంబ్లే తెలిపారు.
కాగా.. ఈ ఘటనకు కొన్ని గంటల ముందు అహ్మద్‌పూర్ తహసీల్‌లోని షిరూర్ తాజ్‌బంద్-ముఖేడ్‌లోని ఒమర్గా పతి సమీపంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మోటర్‌బైక్ రైడర్లు కూడా మరణించారని స్థానిక పోలీసు అధికారి వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గొర్రెలను తీసుకెళ్తున్న పికప్ టెంపోను మోటార్ బైక్ ఢీకొట్టిందని తెలిపారు. దీంతో టెంపో కూడా బోల్తా పడింది.
ఆ ఘటనలో మరణించిన ఒకరు నాందేడ్ జిల్లాలని ముఖేడ్ కు చెందిన హమీద్ చందూలాల్ సయ్యద్ (45)గా, లాతూర్ లోని అహ్మద్‌పూర్ కు చెందిన ఆనంద్ గోవిందరావు కదమ్ గా గుర్తించారు. అయితే టెంపో బోల్తా పడటంతో తొమ్మిది గొర్రెలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మూడు రోజుల కిందట రాజస్థాన్ లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. టోంక్ జిల్లాలో ఓ వ్యాన్, ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందని వారు ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. జాతీయ రహదారిపై దేవ్దావాస్ క్రాసింగ్ వద్ద రాజస్థాన్ ఘటన చోటు చేసుకుంది. డియోలీకి చెందిన భక్తులు ఖాతు శ్యామ్ ఆలయంలో పూజలు చేసి తిరిగి ఇంటికి వ్యాన్ లో ప్రయాణం ప్రారంభించారు.
నా కోడికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన మహిళ.. ఛత్తీస్‌గఢ్‌లో వింత కేసు..
అయితే దేవ్దావాస్ క్రాసింగ్ వద్దకు చేరుకోగానే వ్యాన్ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను సమీపంలోని హాస్పిటల్ మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మృతులను మనీష్ శర్మ, అతడి భార్య ఇషు, సోదరుడు అమిత్, వ్యాన్ డ్రైవర్ రవిగా పోలీసులు గుర్తించారు.