ప్రభుత్వ ఉగ్రవాదం.. పోలీసులను దుర్వినియోగం చేయడమే.. : ఏషియానెట్ న్యూస్ ఆఫీసు దాడుల‌పై మాజీ డీజీపీ ఆగ్రహం

Published : Mar 05, 2023, 01:07 PM IST
ప్రభుత్వ ఉగ్రవాదం.. పోలీసులను దుర్వినియోగం చేయడమే.. : ఏషియానెట్ న్యూస్ ఆఫీసు దాడుల‌పై మాజీ డీజీపీ ఆగ్రహం

సారాంశం

Asianet News office in Kozhikode: ఏషియానెట్ న్యూస్ కోజికోడ్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పీవీ అన్వర్  ఫిర్యాదు మేరకు కోజికోడ్ వెల్లయిల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ వి.సురేష్ నేతృత్వంలోని పోలీసు బృందం ఛానల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే, అంత‌కుముందు రోజు ఆఫీసుపై ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌లు దాడికి దిగి, సిబ్బందిని బెదిరించారు.

SFI attacks Asianet News: ఏషియానెట్ న్యూస్ కోజికోడ్ కార్యాలయాన్ని పోలీసు బృందం తనిఖీ చేయడాన్ని మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ టీ అసఫాలీ తప్పుబట్టారు. ఈ చర్య ప్రభుత్వ ఉగ్రవాదమని, ప్రభుత్వం పోలీసులను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే పీవీ అన్వర్  ఫిర్యాదు మేరకు కోజికోడ్ వెల్లయిల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పక్కా ప్రణాళికతో చేసిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే, అంత‌కుముందు ఎస్ఎఫ్ఐ కార్య‌క‌ర్త‌ల‌తో కూడి బృందం ఏసియానెట్ న్యూస్ కార్యాల‌యంలోకి దూసుకువ‌చ్చి.. దాడికి పాల్ప‌డింది. సిబ్బందిని బెదిరించింది. దీనిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి బ‌దులు.. ప్ర‌స్తుతం కోజికోడ్ ఏసియానెట్ న్యూస్ కార్యాల‌యంలో త‌నిఖీలు చేస్తున్నారు. 

తమకు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతిని అణచివేసేందుకు అధికార యంత్రాంగం పోలీసులను దుర్వినియోగం చేస్తోందని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంలో తనిఖీని బట్టి అర్థం చేసుకోవాలని టీ అసఫాలీ అన్నారు. న్యాయవాది ఎంఆర్ అభిలాష్ కూడా స్పందిస్తూ.. అధికారాన్ని ఉపయోగించుకుని ఇలా వేధింపుల‌కు పాల్ప‌డ‌ట‌మనేది దారుణం.. పోలీసుల చర్య కనీ వినీ ఎరుగనిది.. ప్ర‌తీకార చర్యగా అభివ‌ర్ణించారు. తనిఖీలు నిర్వహించే ప్రత్యేక పరిస్థితులు లేవ‌న్నారు. 

 

పోలీసుల త‌నిఖీలు.. 

ఏషియానెట్ న్యూస్ కోజికోడ్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పీవీ అన్వర్ ఫిర్యాదు మేరకు కోజికోడ్ వెల్లయిల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ వి.సురేష్ నేతృత్వంలోని పోలీసు బృందం ఛానల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తోంది. వెల్లయిల్ సీఐ బాబూరాజ్, నడికావు సీఐ జిజీష్, టౌన్ ఎస్ఐ వి.జిబిన్, ఏఎస్ఐ దీపకుమార్, సీపీవోలు దీపు పి, అనీష్, సజిత సి, సైబర్ సెల్ అధికారి బిజిత్ ఎల్ఏ, తహసీల్దార్ సి.శ్రీకుమార్, పుతియంగడి గ్రామ అధికారి ఎం.సాజన్ తో కూడిన బృందం కార్యాలయాన్ని పరిశీలించింది.

కోజికోడ్ ల్యాండ్ రెవెన్యూ తహసీల్దార్ సి. శ్రీకుమార్ కూడా ఈ టీంలో ఉన్నారు. సెర్చ్ వారెంట్ లేదనీ, పోలీసుల ప్రత్యేక అధికారాలను ఉపయోగించి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీకి తాము పూర్తిగా సహకరిస్తామని ఏషియానెట్ న్యూస్ రీజనల్ ఎడిటర్ షాజహాన్ తెలిపారు. ఈ విషయంలో కార్యాలయంలోని మొత్తం సిబ్బంది, వ్యవస్థలు పోలీసులకు సహకరిస్తున్నాయి. కార్యాలయంలోని అన్ని సౌకర్యాలను తనిఖీ చేయడానికి పోలీసులకు అనుమతి ఇచ్చామనీ, అయితే తనిఖీ పూర్తయ్యే వరకు కార్యాలయం పనితీరును నిలిపివేయడంపై అధికారులకు తమ నిరసనను తెలియజేశామని షాజహాన్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!