Lakhimpur Kheri: రైతులపై పథకం ప్రకారం దాడి.. రాహుల్ ఫైర్

By narsimha lodeFirst Published Oct 6, 2021, 10:47 AM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ లో రైతులపై పథకం ప్రకారంగా దాడి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లఖీంపూర్ లో బాధిత రైతుల కుటుంబాలను తాను పరామర్శించేందుకు వెళ్తానని ప్రకటించారు. ముగ్గురికి అనుమతివ్వాలని ఆయన కోరారు.

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్‌లో  రైతులపై పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పారు. రైతుల హక్కుల్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్  Rahul gandhi మండిపడ్డారు.

 

LIVE: लखीमपुर खेरी में हुए नरसंहार व कांग्रेस नेताओं के साथ अन्याय पर प्रेस के साथियों से मेरी वार्ता। https://t.co/oUC4OA2bKf

— Rahul Gandhi (@RahulGandhi)

బుధవారం నాడు   రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి కొడుకును  ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాము లఖింపూర్  వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.

also read:లక్నో ఎయిర్‌పోర్టులోనే ఛత్తీస్‌ఘడ్‌ సీఎం అడ్డగింత: నిరసనకు దిగిన ముఖ్యమంత్రి

నిన్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి narendra modi  లఖింపూర్ కు వెళ్లకపోవడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. 144 సెక్షన్ అమల్లో ఉంటే lakhimpur వెళ్లేందుకు ముగ్గురికి అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసులను కోరారు.ఈ మేరకు పోలీసులకు లేఖ రాసిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. రైతుల మృతికి కారణమైన వారిని శిక్షించేలా ఒత్తిడి తీసుకురావడమే విపక్షాల పని అని ఆయన చెప్పారు. లఖింపూర్ లో బాధిత రైతుల కుటుంబాలకు  తాము భరోసా కల్పించే ప్రయత్నిస్తామన్నారు రాహుల్ గాంధీ.

ఇవాళ ఇద్దరు సీఎంలతో కలిసి తాను లఖీంపూర్ వెళ్తానని రాహుల్ గాంధీ చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొనేందుకే తాము లఖీంపూర్ వెళ్లాలని భావిస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.హథ్రాస్ అత్యాచార ఘటనలోనూ యూపీ సర్కార్ ఇలానే వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు.


 

click me!