రైతు సంఘాల సంచ‌ల‌న నిర్ణ‌యం.. Punjab Electionsలో పోటీకి సిద్దం!

By Rajesh KFirst Published Dec 25, 2021, 6:45 PM IST
Highlights

కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుక‌వ‌చ్చిన రైతు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌రాజధాని ఢిల్లీ స‌రిహ‌ద్దులో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేసిన రైతులు సంఘాలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌బోతున్నమని ప్ర‌క‌టించాయి. ఈ ఎన్నిక‌ల్లో 22 రైతులు సంఘాలు ఏకమై కొత్త రాజకీయ వేదిక 'సంయుక్త సమాజ్​ మోర్చా'ను స్థాపించాయి. పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఏడాదికి పైగా  పోరాడి .. అంతిమంగా కేంద్రం మెడ‌లు వంచి ఆ చ‌ట్టాల‌ను వెనక్కి తీసుకునేలా చేశాయి. మొత్తం మీద రైతు సంఘాలు విజ‌యం సాధించాయి. ఈ నిర‌స‌న‌ల్లో 32 రైతు సంఘాలు ఒకే తాటిపై వ‌చ్చాయి. ఈ  రైతు సంఘాలన్నీ  సంయుక్తంగా కిసాన్ మోర్చా గా ఏర్పాడాయి. ఇప్ప‌డు ఆ సంఘాలు అదే స్పూర్తితో పంజాబ్ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డానికి.. సిద్ద‌మ‌వుతున్నాయి. 
   

వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కు చెందిన 22 రైతు సంఘాలు పోటీ చేస్తామని ఇవాళ ప్రకటించాయి. ఈ మేర‌కు నేడు చండీఘడ్ లో సమావేశమైన రైతు సంఘాల ప్రతినిధులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే..  గ‌తేడాది వ్యవసాయ చట్టాలను వ్య‌తిరేకంగా నిర‌స‌నలు చేపట్టిన పంజాబ్ కు చెందిన 32 రైతు సంఘాల్లో ఈ 22 సంఘాలు మాత్ర‌మే ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నాయి. సంయుక్త్ సమాజ్ మోర్చా పేరుతో ఓ రాజకీయ కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తామని రైతు సంఘం నేత హర్మీత్​ సింగ్ కదియాన్​ వెల్లడించారు. 

Read Also: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు గుడ్ న్యూస్.. ఇక అలాంటి పోస్టులను వెంటనే డిలీట్ చేయొచ్చు..


ఈ సంఘాలన్నీ దిల్లీ సరిహద్దులో జరిగిన రైతు నిరసనల్లో పాల్గొన్నాయి. ఈ పోరాటం ద్వారా రైతు సంఘాలు దేశ‌వ్యాప్తంగా  అందరి దృష్టినీ ఆకర్షించారు. తొలుత పంజాబ్ లో ప్రారంభ‌మైనా ఈ పోరాటం ఆ త‌ర్వాత ఉత్త‌ర భార‌త దేశ‌మంత‌ట పాకింది. దీంతో రైతు సంఘాల నేతలు కూడా ఆయా రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందారు. అయితే నిరసనల్లో మొత్తం 32 రైతుల సంఘాలు పాల్గొనగా 22 రైతుల సంఘాల మాత్రమే రాజకీయ వేదికను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 

Read Also: BJP ని బ‌లోపేతం చేయండి.. ప్ర‌ధాని మోడీ పిలుపు.. Party Fund గా ₹ 1,000 ల‌ విరాళం

రాజ‌కీయ వ్యవస్థలో మార్పు తీసుక‌రావ‌డం కోసమే..  ఈ కీల‌క  నిర్ణయం తీసుకున్నామని, తమ మోర్చాకు ప్రజలు మద్దతు ఇవ్వాలని రైతు సంఘం నాయకుడు బల్బీర్ సింగ్ రాజెవాల్​ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా భిన్న సిద్ధాంతాలు కలిగిన 400 సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల స‌మ‌స్య‌ల‌పై పూర్తి అవగాహ‌న వ‌చ్చింద‌ని , రైతుల సమస్యలపైనే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పంజాబ్ లో రైతు జ‌నాభా అధికంగా ఉంది.  ఈ త‌రుణంలో రైతులు సంఘాలు తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నం గా మారింది. ఈ సంఘాలు పోటీలో నిలుస్తే.. రైతు ఓట్లు కీలకంగా పరిగణించబడుతున్నాయి.

Read Also: Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్‌లో మరోసారి కాషాయ జెండానే.. అంచనా వేసిన తాజా సర్వే.. కానీ..

ఇదిలా ఉంటే.. గ‌త నెల కేంద్రంతో సుధీర్ఘంగా చ‌ర్చించిన పిమ్మ‌ట‌..  రైతులు సంఘాలు త‌మ‌ ఉద్యమాన్ని తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశామని, తమ డిమాండ్లు ఇంకా నెరవేరలేదని పేర్కొంది. 2022 జనవరి 15న జరిగే సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పింది. 

click me!