Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్‌లో మరోసారి కాషాయ జెండానే.. అంచనా వేసిన తాజా సర్వే.. కానీ..

By Sumanth KanukulaFirst Published Dec 25, 2021, 5:43 PM IST
Highlights

2022 ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Uttarakhand Election 2022) బీజేపీ మరోసారి అధికారం చెపడుతుందని ఇండియా న్యూస్- జన్‌ కీ బాత్ పోల్ (India News-Jan Ki Baat poll) అంచనా వేసింది. అంతేకాకుండా పార్టీలు గెలుపొందే స్థానాలకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఐదు రాష్ట్రాల్లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఫోకస్ చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి పలు సంస్థలు సర్వేలు నిర్వహించి.. ఓటర్ల నాడీని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తాజాగా 2022 ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Uttarakhand Election 2022) బీజేపీ మరోసారి అధికారం చెపడుతుందని ఓ సంస్థ ఓపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇండియా న్యూస్- జన్‌ కీ బాత్ పోల్ (India News-Jan Ki Baat poll ) అంచనాల ప్రకారం.. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 35 నుంచి 38  సీట్ల వరకు గెలుచుకోని సులువుగా అధికార పీఠాని కాపాడుకోనుంది. ప్రస్తుతం అంతర్గత తిరుగుబాటు పరిణామాలు ఎదుర్కొంటున్న  కాంగ్రెస్ 27 నుంచి 31 సీట్ల వరకు గెలుచుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి నుంచి ఆరు స్థానాలకే పరిమితం అవ్వొచ్చని అంచనా వేసింది. అయితే గత ఎన్నికల్లో 57 స్థానాల్లో విజయం సాధించి అధికారం కైవసం చేసుకన్న బీజేపీ.. ఈసారి మాత్రం 20 వరకు సీట్లు కోల్పోయే అవకాశం ఉందని ఇండియా న్యూస్- జన్‌ కీ బాత్ పోల్  అంచనా వేసింది. 

అయితే బీజేపీ ఓట్ షేర్ కాంగ్రెస్ కన్నా ఒక్క శాతం‌లోపు మాత్రమే ఎక్కువగా ఉన్నప్పటికీ.. బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని  జన్‌ కీ బాత్ పోల్  అంచనా వేసింది. ఓటు షేర్ వియానికి వస్తే బీజేపీకి 39 శాతం, కాంగ్రెస్‌కు 38.2 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 11.7 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ ఓపీనియన్‌ పోల్ 5 వేల మందికి పైగా పాల్గొన్నారు. 

ప్రభుత్వ వ్యతిరేకత ఎలా ఉందంటే..
వీరిలో 69 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ పథకాలు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే 31 శాతం మంది మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ఇక, ప్రభుత్వ వ్యతిరేకత విషయానికి వస్తే.. 60 శాతం మంది అభ్యర్థులకు వ్యతిరేకంగా ఉన్నారు. 30 శాతం మంది పార్టీకి వ్యతిరేకత ఉందని చెప్పారు. 10 శాతం మంది మొత్తం వ్యతిరేకత ఉందని అన్నారు. 

Also Read: Assembly Election 2022: ఉత్త‌రాఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ లో కలవరం.. పార్టీలో మార్పులు చేయాలంటున్న మాజీ సీఎం!

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం, వలసలు అత్యంత ముఖ్యమైన సమస్య అని పోల్‌‌లో పాల్గొన్న 47 శాతం మంది విశ్వసించారు. 20 శాతం మంది ప్రజల ఆరోగ్యం, తాగునీటిని ప్రధాన సమస్యగా పేర్కొన్నారని ఓపీనియన్ పోల్ తెలిపింది. మరో 12 శాతం మంది విద్యను, 10 శాతం మంది ద్రవ్యోల్బనం ఎన్నికల్లో ముఖ్యమైన అంశం కావచ్చని చెప్పారు. 

ఈ పోల్ అంచనా ప్రకారం.. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లలో 45 శాతం మంది  బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారు. 35 శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అయితే కాంగ్రెస్‌కు ముస్లింల నుంచి 85 శాతం, సిక్కు సామాజిక వర్గం నుంచి 60 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ షెడ్యూల్ కులాల ఓటర్లలో కూడా  75 శాతం అనుకూలంగా ఉన్నట్టుగా ఇండియా న్యూస్- జన్‌ కీ బాత్ పోల్ తెలిపింది. 

ముఖ్యమంత్రి విషయానికి వస్తే.. 
జన్‌ కీ బాత్ పోల్ సర్వేలో ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన సర్వేలో.. ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) అత్యంత ప్రజారణ పొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 40 శాతం మద్దతు లభించింది. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం Harish Rawat 30 శాతం మద్దతుతో రెండో స్థానంలో, బీజేపీ నేత అనిల్ బలూనీకి 20 శాతం మద్దతు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రిటైర్డ్ కల్నల్ అజయ్ కొథియాల్‌కు 9 శాతం మద్దతు తెలిపారని జన్‌కీ బాత్ పోల్ పేర్కొంది. 

click me!