Latest Videos

యూపీ సీఎం యోగి ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్: కేసు నమోదు

By narsimha lodeFirst Published Mar 11, 2024, 9:59 AM IST
Highlights

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు చెందినే ఫేక్ వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.

న్యూఢిల్లీ: టెక్నాలజీని ఎలా ఉపయోగించుకొంటే  అలా ఉపయోగపడుతుంది.  పెరిగిన సాంకేతిక అభివృద్దిని మంచి కోసం ఉపయోగిస్తే మంచి జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో  టెక్నాలజీని  మంచి కోసం కంటే చెడు పనుల కోసం ఎక్కువగా వినియోగించినట్టుగా  అర్ధమౌతుంది.  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ  సహాయంతో  ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్  ఫేక్ వీడియో ఒకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

also read:రోబో ద్వారా భోజనం సరఫరా: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

డయాబెటీస్ కు సంబంధించిన  ఔషధాన్ని తయారు చేసినట్టుగా ఈ వీడియోలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టుగా ఉంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో  పోలీసులు కేసు నమోదు చేశారు. 

also read:వాయు కాలుష్యానికి ఆత్మహత్యలకు లింక్: రిపోర్ట్

41 సెకన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫేస్ బుక్ లో ఈ వీడియోకు  2.25 లక్షలకు పైగా మంది వీక్షించారు. అంతేకాదు  120 షేర్లు వచ్చాయి.

also read:టీడీపీ-జనసేన-బీజేపీ నేతల భేటీ: సీట్ల సర్ధుబాటుపై చర్చలు

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్  వీడియోను ఎఐ ద్వారా  మార్చాడని పోలీసులు  అనుమానిస్తున్నారు. డయాబేటీస్ వ్యాధికి సంబంధించి  తయారు చేసినట్టుగా ఆ వీడియోలో సీఎం పేర్కొన్నట్టుగా  ఉంది. దేశం నుండి డయాబెటీస్  తరిమివేయనున్నట్టుగా ఆ వీడియో ఉంది. ఈ  ఔషధాన్ని కొనుగోలు చేయాలని  కూడ సీఎం పేర్కొన్నట్టుగా వీడియోలో ఉంది.ఈ ఫేక్ వీడియోపై  ఐపీసీ 419, 420, 511 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని  2008 సెక్షన్  66 కింద అభియోగాలు నమోదు చేశారు.

also read:అరుదైన గౌరవం:స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హైద్రాబాద్ మెట్రో రైలు విజయగాధ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,  ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్,  ప్రముఖ నటి రష్మిక మందన్నకు చెందిన ఫేక్ వీడియోలో గతంలో సోషల్ మీడియాలో  వైరలయ్యాయి.ఈ విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

click me!