ఎయిమ్స్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. తాజా హెల్త్‌ అప్‌డేట్ ఇదే

Siva Kodati |  
Published : Oct 15, 2021, 04:25 PM ISTUpdated : Oct 15, 2021, 04:26 PM IST
ఎయిమ్స్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. తాజా హెల్త్‌ అప్‌డేట్ ఇదే

సారాంశం

అస్వస్థతకు గురైన కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో (aiims delhi) చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు ఎయిమ్స్‌ వైద్యులు. 

అస్వస్థతకు గురైన కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో (aiims delhi) చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు ఎయిమ్స్‌ వైద్యులు. ప్రస్తుతం మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ఈ నెల 13వ తేదీన ఎయిమ్స్‌ చేరారు.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని.. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరినట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) గురువారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు అరగంటపాటు అక్కడేవున్న ఆయన... మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌ను (gursharan kaur) ఆయన పరామర్శించారు. 

ALso Read:మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా (randeep guleria) నేతృత్వంలో వైద్య బృందం మన్మోహన్ కు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi).. మన్మోహన్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని.. ఆయన ఆరోగ్యవంతంగా జీవించాలనీ ప్రార్థిస్తున్నాను' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

మరోవైపు మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిను గురించి తెలుసుకోవడానికి గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా (mansukh mandaviya) ఢిల్లీలోని ఎయిమ్స్ సందర్శించారు. 'మన్మోహన్ సింగ్ కొన్ని అనారోగ్య ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది' అని ఆల్ ఎయిమ్స్ అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయననను ఎయిమ్స్‌లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత మన్మోహన్‌కి కరోనా (coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆ తర్వాత మార్చి 4, ఏప్రిల్ 3 న రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌లను కూడా తీసుకున్నారు. 2009 లో మన్మోహన్ సింగ్‌ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుండి రాజ్యసభ (rajya sabha) సభ్యుడుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్