జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఇద్దరు సైనికుల మృతి

By narsimha lodeFirst Published Oct 15, 2021, 3:46 PM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఉగ్రవాదులు జరిగిన ఎన్‌కౌంటర్ లో  ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు. గురువారం నాడు తీవ్రవాదులు, పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో  విక్రమ్ సింగ్, నేగి, యోగంబర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. 

శ్రీనగర్:Jammu kashmir లో శుక్రవారం నాడు Terrorists జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారని Armyఅధికారులు ప్రకటించారు.జమ్మూలోని poonchని మెందర్ అటవీప్రాంతంలో  తీవ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న  సమయంలో  టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు.గురువారం నాడు తీవ్రవాదులు, పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో  విక్రమ్ సింగ్, నేగి, యోగంబర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు.  వీరిద్దరూ చికిత్స పొందుతూ మరణించారని ఆర్మీ అధికారులు తెలిపారు.

కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి క్రాల్ పోరాలోని రేషిగుండ్ అటవీప్రాంతంలో గాలించారు. ఈ గాలింపులో ఏకే 47 రైఫిల్, నాలుగు మ్యాగజైన్ లు, 720 రౌండ్లు, మూడు వైర్ లెస్ సెట్లు, ఐదు వైర్ లెస్ సెట్ యాంటెనాలు, మూడు చైనీస్ గ్రెనెడ్లు, 8 డిటోనేటర్లు, ఒక దిక్చూచి దొరికిందని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. 

also read:జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. జైషే టాప్ కమాండర్ టెర్రరిస్టు హతం

నేగి ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గర్హ్వాల్‌ విమన్ గావ్ వాసి, మరొకరు ఉత్తరాఖండ్ లోని శంకర్ చమోలివాసిగా ఆర్మీ ప్రకటించింది.  మూడు మాసాలుగా ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో తలదాచుకొన్నారనే సమాచంరతో ఆర్మీ అధికారులు ఈ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు.దీంతో ఉగ్రవాదులకు ఆర్మీకి మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయని అధికారులు తెలిపారు.ఈ నెల 11 నుండి రాజౌరి-పూంచ్  ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాల అదుపు కోసం ఆర్మీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే  కూంబిం్ నిర్వహిస్తున్న ఆర్మీపై మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.


 

click me!