Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు మనీ ఆర్డర్.. షారూఖ్ ఖాన్‌తో వీడియో కాల్

By telugu teamFirst Published Oct 15, 2021, 2:35 PM IST
Highlights

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ రూ. 4,500 మనీ ఆర్డర్ పొందాడు. తల్లిదండ్రులు షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌లతో వీడియో కాల్ మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు జైలు ఆహారాన్నే అందిస్తున్నట్టు వివరించారు. ఈ డబ్బుతో జైలులోని క్యాంటీన్ నుంచి ఆహారం కొనుక్కోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
 

ముంబయి: బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న Shah Rukh Khan తనయుడు Aryan Khan కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు రూ. 4,500 money order అందినట్టు అధికారులు వివరించారు. తల్లిదండ్రులు షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌‌లతో వీడియో కాల్‌లో మాట్లాడినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు.

జైలులో ఉన్న వ్యక్తికి గరిష్టంగా రూ. 4,500 మాత్రమే మనీ ఆర్డర్ చేయడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ నిబంధనలకు లోబడే షారూఖ్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మనీ ఆర్డర్ చేశారు. ఖైదీలను తమ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వారంలో రెండు సార్లు అవకాశమివ్వాలని బాంబే హైకోర్టు ఆదేశాలు పేర్కొంటున్నాయి. ఈ ఆదేశాలకు లోబడే ఆర్యన్ ఖాన్‌తో తల్లిదండ్రులు షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌లు video call చేసి మాట్లాడినట్టు తెలిసింది. అయితే, మనీ ఆర్డర్ ఎప్పుడు పంపించారని, వీడియో కాల్ ఎప్పుడు చేశారనే ప్రశ్నకు అధికారులు స్పష్టతనివ్వలేదు.

కాగా, ఆర్యన్ ఖాన్‌కు జైలు ఆహారాన్నే అందిస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచాల్ వివరించారు. ఇది మినహా ఇంటి ఆహారం లేదా బయటి ఆహారాన్ని అనుమతించే ప్రసక్తే లేదని తెలిపారు. కోర్టు ఆదేశాలు వెలువడే వరకు జైలు ఆహారమే అందిస్తామని స్పష్టం చేశారు.

Also Read: Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లేదు.. వచ్చే వారానికి తీర్పు వాయిదా

ముంబయి drugs క్రూజ్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్నారు. ఎన్‌సీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాదులు బెయిల్ అప్లికేషన్ వేశారు. ముంబయి సెషన్స్ కోర్టులో నిన్నటి వరకు రెండు రోజులు వరుసగా వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తుపై ముంబయి సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆర్యన్ ఖాన్‌ జైలులో ఉండాల్సిందే.

ఆర్యన్ ఖాన్ రెగ్యులర్‌గా డ్రగ్స్ తీసుకునేవాడని, ఆయన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో టచ్‌లో ఉన్నారని ఎన్‌సీబీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వడం సరికాదని, ఆయన బెయిల్‌పై బయటకు వెళ్తే ఆధారాలను రూపుమాపే ప్రమాదం ఉన్నదని వాదించారు. కాగా, ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ ఆ వాదనలను కొట్టిపారేశారు.

ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్‌‌ ఆధారంగా ఇలాంటి వాదనలు చేయడం సరికాదని అమిత్ దేశాయ్ అన్నారు. ఇప్పటి  యువత వాడే భాష విభిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. తన క్లయింట్ డ్రగ్స్ తీసుకోడని స్పష్టం చేశారు. అరెస్టు చేసినప్పుడూ ఆయన దగ్గర డ్రగ్స్ లేదని అన్నారు. ఈ దశలో తాము తమ క్లయింట్ నిర్దోషి అని వాదించడం లేదని, కానీ, ఇప్పుడు బెయిల్ కోసమే వాదిస్తున్నామని, ప్రస్తుత పంచనామా పత్రాల ఆధారంగానైనా బెయిల్ ఇవ్వకుండా
జైలుకే పరిమితం చేయాల్సిన పనిలేదని వాదించారు.

click me!