ఈసారి ఇంజన్లు ఫెయిల్ అయినా.. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది - ఇస్రో చీఫ్ సోమనాథ్

Published : Aug 09, 2023, 10:00 AM IST
ఈసారి ఇంజన్లు ఫెయిల్ అయినా.. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది - ఇస్రో చీఫ్ సోమనాథ్

సారాంశం

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ సారి చంద్రయాన్ -3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సేఫ్ గా దిగుతుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్ -2లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో డిజైన్ లో చాలా మార్పులు చేశామని చెప్పారు.

చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ఆగస్టు 23న సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రయాన్-3లోని అన్ని సెన్సార్లు లేదా ఇంజిన్లు విఫలమైనప్పటికీ, ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై సరిగ్గానే ల్యాండ్ అవుతుందని తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

కొండచరియలు విరిగిపడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి దిగ్బంధం.. నిలిచిన అమర్ నాథ్ యాత్ర

దిశా భారత్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 'చంద్రయాన్-3: భారత్స్ ప్రైడ్ స్పేస్ మిషన్' అనే అంశంపై సోమనాథ్ మాట్లాడుతూ మంగళవారం మాట్లాడారు. వైఫల్యాలను తట్టుకునే విధంగా ల్యాండర్ 'విక్రమ్'ను తయారు చేసినట్లు తెలిపారు.  ‘‘సెన్సార్లన్నీ ఫెయిల్ అయితే ఏదీ పనిచేయదు. అయినా అది (విక్రమ్) ల్యాండింగ్ అవుతుంది. ప్రొపల్షన్ సిస్టమ్ బాగా పనిచేసే విధంగా డిజైన్ చేశాం’’ అని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

ఫేస్ బుక్ లో పరిచయం.. కారులో ఎత్తుకెళ్లి.. 28 రోజుల పాటు బంధించి బాలికపై పలువురితో కలిసి అత్యాచారం

చంద్రుడి ఉపరితలంపై నిట్టనిలువుగా 'విక్రమ్' ల్యాండ్ చేయడమే అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాలు అని సోమనాథ్ తెలిపారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత అది అడ్డంగా కదులుతుందని చెప్పారు. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వరుస విన్యాసాల ద్వారా దీన్ని నిలువు స్థితికి తీసుకురానున్నట్టు తెలిపారు.

నేడు పాక్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న షెహబాజ్ షరీఫ్.. ఎందుకంటే ?

చివరిసారిగా 2019లో చంద్రయాన్-2 మిషన్ సమయంలో ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలంపై దింపడంలో ఇస్రో విఫలమైనందున ఈ విన్యాసం చాలా ముఖ్యమైనది. కాగా.. జులై 14న చంద్రయాన్-3ని ఇస్రో అంతరిక్షంలోకి పంపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 5న వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో సైంటిస్టులు మరుసటి రోజే కక్ష్య తగ్గింపు విన్యాసం నిర్వహించారు.ఆగస్టు 9, ఆగస్టు 14, 16 తేదీల్లో డీ ఆర్బిట్ విన్యాసాలు నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల తర్వాత దాని కక్ష్య చంద్రుడి నుంచి 100 కి.మీ×100 కిలోమీటర్లకు తగ్గుతుంది.  ల్యాండర్ 'డీబూస్ట్' తర్వాత ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ సెపరేషన్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?