
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై టి2 మారోగ్ రాంబన్ సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యింది. దీని వల్ల ఈ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ నుండి ధృవీకరణ లేకుండా ఎన్హెచ్ -44 పై ప్రయాణించవద్దని జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు.
మహిళా పోలీసుకే వేధింపులు.. 300 సార్లు కాల్ చేసి.. కోరిక తీర్చాలంటూ ఒత్తిడి..
కాగా.. కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లే అమర్ నాథ్ యాత్రను కూడా నిలిపివేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీంతో అమర్ నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఐదు రోజుల కిందట ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై నందప్రయాగ్, చింకా సమీపంలోని రహదారిపై కడా భారీగా కొండచరియలు కుప్పకూలాయి. ఈ కొండ చరియాల శిథిలాలు రోడ్డుపై పేరుకుపోయాయి. దీంతో ఈ రహదారిని అధికారులు మూసివేశారు. రోడ్డుపై భారీగా పేరుకుపోయిన శిథిలాల కుప్ప ఫొటోలను చమోలి పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతకు ముందు రోజు కూడా బద్రీనాథ్ జాతీయ రహదారిపై పిపల్కోటి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ దారిని కూడా అధికారులు మూసివేశారు.