కేరళలో శత్రువులు, బయట బెస్ట్ ఫ్రెండ్స్.. వామపక్షాలు, కాంగ్రెస్ పై మోడీ విమర్శలు..

By Sairam Indur  |  First Published Feb 27, 2024, 4:45 PM IST

కాంగ్రెస్, వామ పక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలో ఈ పార్టీ నాయకులంతా శత్రువులనీ కానీ బయట మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారని చెప్పారు. రాహుల్ గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం నుంచి సీపీఐ తన అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజు ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.


కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అభ్యర్థిగా అనీ రాజాను ప్రకటించింది. ఈ ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ సీపీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం చోటు చేసుకున్న మరుసటి రోజు ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కాంగ్రెస్, వామపక్షాలను ఉద్దేశించి.. ‘‘కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ లు శత్రువులు, కానీ బయట బెస్ట్ ఫ్రెండ్స్’’ అని వ్యాఖ్యానించారు.

వివాదాస్పద నేత, ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ కన్నుమూత..

Latest Videos

తిరువనంతపురంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వయనాడ్ నుంచి యువరాజును గద్దె దింపాలని వామపక్షాలు కోరుకుంటున్నాయని అన్నారు. ‘‘ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు హింసకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. కేరళలో ఒకరికొకరు శత్రువులు అయితే కేరళ వెలుపల మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి కూర్చొని తినే స్నేహితులు’’ అని ప్రధాని తెలిపారు. 

త్వరలో బిడ్డకు స్వాగతం పలకనున్న సిద్ధూ మూస్ వాలా తల్లిదండ్రులు.. ?

‘‘కాంగ్రెస్ యువరాజును వయనాడ్ నుంచి తరిమికొట్టాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. కేరళకు దూరంగా ఉండాలని యువరాజుకు వీరు సలహా ఇస్తున్నారు’’ అని రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్, దాని ఇతర కమ్యూనిస్టు కూటమిలకు ఒకే ప్రాధాన్యత ఉంది. తమ కుటుంబాన్ని మాత్రమే దేశాన్ని పాలించడానికి వారు అనుమతించారు. వారికి భారతీయుల సంక్షేమం కంటే వారి కుటుంబ సంక్షేమమే గొప్పది’’ అని అన్నారు.

త్వరలో బిడ్డకు స్వాగతం పలకనున్న సిద్ధూ మూస్ వాలా తల్లిదండ్రులు.. ?

కేరళలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ లో రెండవ అతిపెద్ద సంకీర్ణ భాగస్వామి అయిన సీపీఐ లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత అనీ రాజాను బరిలోకి దింపింది. కాగా.. రాహుల్ గాంధీ లెఫ్ట్ అభ్యర్థితో పోటీ చేయకుండా బీజేపీకి అభ్యర్థిపై పోటీ చేయాలని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు.

click me!